ప్రభుత్వాధికారి పైత్యం! ఫోన్ పడిపోయిందని రిజర్వాయర్‌లోని 21 లక్షల నీటిని ఖాళీ చేయించాడు
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లో ప్రభుత్వాధికారి తన స్వార్థం కోసం వందలాది మంది రైతులకు అన్యాయం చేశాడు. సెల్ఫీ తీసుకుంటుండగా అతని సెల్‌ఫోన్ రిజర్వాయర్‌లో పడిపోయింది. దీంతో తన ఫోన్ కోసం ఏకంగా రిజర్వాయర్‌లోని 21 లక్షల లీటర్ల నీటిని ఖాళీ చేయించాడు.అయితే, అతనికి తన ఫోన్ దొరికినా అది పనిచేయని స్థితిలోకి వెళ్లిపోయింది. ఇక అతడు చేసిన దుర్మార్గపు పనికి మూల్యం కూడా చెల్లించుకున్నాడు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో చోటు చోసుకుంది.
వివరాల్లోకి వెళితే.. కోయలిబెడ బ్లాక్‌కు చెందిన ఫుడ్ ఇన్‌స్పెక్టర్ రాజేష్ విశ్వాస్ సెలవురోజున కంకేర్ జిల్లాలోని ఖేర్‌కట్టా రిజర్వాయర్‌కు తన మిత్రులతో కలిసి మే 21వ తేదీన ఆదివారం పిక్నిక్‌కి వెళ్లాడు. ఈ క్రమంలో సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించాడు. అయితే చేయి జారీ తన రూ. 96,000 విలువగల సామ్‌సంగ్ ఎస్23 ఫోన్ రిజర్వాయర్‌లో పడిపోయింది. ముఖ్యమైన డేటా ఉందంటూ ఫోన్ కోసం ఈతగాళ్లతో వెతికించాడు. ఫలితం లేకపోవడంతో విశ్వాస్ నీటిపారుదల శాఖ కార్యాలయానికి వెళ్లాడు. డ్యాంలో మునిగిన తన ఫోన్‌ను ఎలా సాధించాలని చర్చించారు.

చివరికి రిజర్వాయర్ నుంచి నీటిని బయటకు తోడాలని నిర్ణయించుకున్నాడు. 30 హార్స్ పవర్ డీజిల్ పంపులతో వరుసగా మూడు రోజుల పాటు 15 అడుగుల నీటిని తొడించేశాడు. వరుసగా మూడు రోజుల పాటు నీటిని తోడిన తర్వాత అతడి ఫోన్ దొరికింది. కానీ, అప్పటికే నీటిలో పూర్తిగా తడిసిపోవడంతో ఫోన్ పనిచేయ లేదు. ఎంత ప్రయత్నించినా ఫోన్ ఆన్ కాలేదు. దీంతో మూడు రోజుల ఆరబెట్టాడు. అయినా ఫోన్ పనిచేయలేదు. కానీ, పెద్ద మొత్తంలో సాగునీరు మాత్రం వృథా చేశాడు ఆ అధికారి.
ఈ క్రమంలో మే 22 నుంచి 25వ తేదీ వరకు పంపుల ద్వారా 21 లక్షల లీటర్ల నీటిని తోడేయడంపై విమర్శలు చెలరేగాయి. స్థానిక రైతులు, ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై కలెక్టర్‌కు ఫిర్యాదు అందడంతో నీటిపారుదల, జలవనరుల శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆ ప్రక్రియను నిలిపివేశారు. ఆ తర్వాత అధికారాన్ని దుర్వినియోగం చేయడంతోపాటు నీటిని ఖాళీ చేయడంపై అనుమతి తీసుకోకపోవడంతో కంకేర్ జిల్లా కలెక్టర్ సదరు అధికారి రాజేష్ విశ్వాస్‌ను విధుల నుంచి సస్పెండ్ చేశారు.
In #Chhattisgarh, an officer's I-phone fell into a dam reservoir. Two pumps of 30 horsepower, ran 24 hrs, and pumped out-hold your breath- 21 lakh litres of #water, this water could have irrigated 1,500 acres of land, & this is when "there is severe shortage of water i the area ! pic.twitter.com/vBSol7EafS
— Ramandeep Singh Mann (@ramanmann1974) May 26, 2023
కాగా, మూడు రోజుల పాటు 21 లక్షల లీటర్ల నీరు బయటకు పోయింది. నీరంతా వృథాగా పోవడంపై రైతులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ నీటితో సుమారు 1,500 ఎకరాల భూమికి సాగునీరు అందించే అవకాశం ఉండేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అయితే, ఖేర్‌కట్టా రిజర్వాయర్ నుంచి తోడేసిన నీరు సాగుకు పనికిరాదని రాజేష్ విశ్వాస్ బుకాయించాడు. డ్యాంలో పడిపోయిన ఫోన్‌లో ముఖ్యమైన ప్రభుత్వ డేటా ఉందని.. అందుకోసమే నీటిని తోడేశానని తను చేసిన పనిని సమర్థించుకున్నాడు. నీటిని ఖాళీ చేయడానికి కంకేర్ నీటిపారుదల శాఖ ఎస్డీవో ద్వారా మౌఖిక అనుమతి తీసుకున్నానని చెప్పాడు. డీజిల్ పంపుతో నీరు తోడటానికి రూ.7,000 నుంచి -8,000 వరకు ఖర్చు అయిందని, దాని వల్ల ఏ రైతు కూడా నష్టపోలేదని విశ్వాస్ చెప్పడం గమనార్హం.
-
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..? -
మళ్ళీ లాక్డౌన్? కేంద్రం సంచలన ప్రకటన -
వచ్చే మూడు నెలలు హై అలర్ట్, ఏపీలో ఎండల ముప్పు











Click it and Unblock the Notifications