వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాక్: 210 వెబ్‌సైట్లలో నెంబర్లతో సహ ఆధార్ సమాచారం

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన 210 వెబ్‌సైట్లలో ఆధార్ సమాచారాన్ని బహిరంగంగా ప్రదర్శించారని యూఐడిఏఐ ప్రకటించింది.నిబంధనలను ఉల్లంఘించి ఈ సమాచారాన్ని వెబ్‌సైట్లలో ప్రదర్శించారని యూఐడిఏఐ ప్రకటించింది.ఈ సమాచారాన్ని వెబ్‌సైట్ల నుండి తొలగించినట్టు ప్రకటించింది.

సమాచారహక్కు చట్టం కింద ఓ వ్యక్తి ఈ విషయమై ప్రశ్నిస్తే యూఐడిఏఐ షాకింగ్ విషయాలను బయట పెట్టింది. కొందరు లబ్ధిదారుల పేర్లు, వివరాలను ఆధార్‌ సంఖ్య సహితంగాయునిక్‌ ఐడెంటిఫికేషన్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (యూఐడీఏఐ) వెల్లడించింది.

నిబంధనలను ఉల్లంఘించి ప్రదర్శించిన ఆ సమాచారాన్ని వెబ్‌సైట్ల నుంచి పూర్తిగా తొలగించినట్టు ప్రకటించింది. అయితే ఈ నిబంధనల ఉల్లంఘన ఎప్పడు జరిగిందో, ఎప్పుడు సమాచారాన్ని తొలగించారో మాత్రం వెల్లడించలేదు.

210 govt. websites made Aadhaar details public: UIDAI

పన్నెండు అంకెల ఆధార్‌ విశిష్ట గుర్తింపు సంఖ్యను యూఐడీఏఐ జారీ చేస్తుంది. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తాము ప్రవేశపెట్టిన పథకాల ప్రజయోనాలు పొందాలంటే లబ్ధిదారులకు ఆధార్‌ను తప్పనిసరి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వ్యక్తిగత సమాచారం గోప్యంగా ఉండటం లేదని, ఇది ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తుందని కొందరు సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

ఈ విషయమై విచారణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తమ వద్ద ఉన్న వ్యక్తిగత సమాచారం గోప్యంగా, సమగ్రంగా, భద్రంగా ఉంటుందని యూఐడీఏఐ స్పష్టం చేసింది. వ్యక్తుల వివరాలు ప్రదర్శించకుండా ఉండేలా కఠినమైన నిబంధనలు ఉన్నాయని తెలిపింది.

English summary
More than 200 central and State government websites publicly displayed details such as names and addresses of some Aadhaar beneficiaries, the Unique Identification Authority of India has said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X