22 మంది ప్రాణం తీసిన పౌర్ణమి పూజలు, చెరువులోకి ట్రాక్టర్ పల్టీ, సీసీటీవీ కెమెరాల్లో !

గ్రామంలో నివాసం ఉంటున్న చాలా మంది వారి కుటుంబ సమేతంగా గంగానదిలో స్నానమాచరించి దేవుడి దర్శనానికి బయలుదేరిన భక్తులతో వెళ్తున్న ట్రాక్టర్ ప్రమాదానికి గురైంది. ఉత్తరప్రదేశ్‌లోని కదర్‌గంజ్‌కు వెళ్తుండగా ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది. ఆ ప్రమాదంలో ట్రాక్టర్ చెరువులో పడింది. ఈ ప్రమాదంలో చిన్నారులు, మహిళలతో సహా 22 మంది చనిపోయారు.

పలువురు గాయపడటంతో వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ట్రాక్టర్‌లో భక్తులను ఎక్కించుకుని కదర్‌గంజ్ క్షేత్రానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పెద్ద సంఖ్యలో భక్తులను ట్రాక్టర్‌లో ఎక్కించారు. దీంతో ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య పెరిగిందని అధికారులు అంటున్నారు. వేగంగా వెలుతున్న ట్రాక్టర్ అదుపు తప్పి ఒక్కసారిగా బోల్తా పడింది. తర్వాత ట్రాకర్ చెరువులోకి పడిపోయింది. ఈ ప్రమాదంలో 22 మంది భక్తులు మృతి చెందారని అధికారులు చెప్పారని స్థానిక మీడియా తెలిపింది.

 22 people including children and women died after the tractor overturned and fell into the pond in Uttar Pradesh

సమాచారం అందుకున్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్థానిక జిల్లా కలెక్టర్‌కు ఫోన్ చేసి క్షతగాత్రులకు సరైన చికిత్స అందించాలని ఆదేశించారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు సీఎం యోగి ఆదిత్యనాథ్ ఒక్కొక్కరికి రూ. 2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. గాయపడిన వారికి రూ.50,000 పరిహారం ప్రకటించారు. కసగంజ్ జిల్లాలో జరిగిన ప్రమాదం గురించి తెలియడం బాధాకరం అని సీఎం యోగి ఆదిత్యనాథ్ విచారం వ్యక్తం చేశారు.

మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి, క్షతగాత్రులకు సరైన వైద్యం అందించాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించామని, మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని శ్రీరాముడిని ప్రార్థిస్తున్నట్లు యోగి ఆదిత్యనాథ్ ట్వీట్ చేశారు.

బోల్తాపడిన ట్రాక్టర్ నేరుగా పెద్ద చెరువులో పడిపోయింది. తీవ్రంగా గాయపడిన పలువురిని చెరువులో నుంచి బయటకు తీసి వారిని రక్షించడానికి ప్రయత్నించక ముందే చనిపోయారని స్థానిక మీడియా తెలిపింది.

 22 people including children and women died after the tractor overturned and fell into the pond in Uttar Pradesh
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నారు. జేసీబీలతో రెస్క్యూ పనులు ప్రారంభించారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి పలువురిని విచారించారు. అంతేకాదు అందుబాటులో ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పోలీసు అధికారులు పరిశీలించారు. విషయం తెలుసుకున్న కొందరు మంత్రులు, స్థానిక ఎమ్మెల్యే సంఘటనా స్థలానికి, ఆసుపత్రులకు పరుగుతీశారు.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+