ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి మహిళపై గ్యాంగ్ రేప్
న్యూఢిల్లీ: ఉద్యోగం కోసం వచ్చిన 22 ఏళ్ల మహిళపై ఏడుగురు వ్యక్తులు అత్యంత క్రూరంగా అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారణ సంఘటన గత బుధవారం గుర్గావ్‌లోని ఓ ప్రైవేట్ గెస్ట్ హౌస్ లో చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పశ్చిమ బెంగాల్‌కు చెందిన బాధితురాలు గత కొంత కాలంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంది. ఈ ఏడుగురు నిందితుల్లో ఒకడైన కపిల్ యాదవ్ ఉద్యోగం ఇప్పిస్తానంటూ తమ ఆఫీస్‌గా చెప్పుకుంటున్న గెస్ట్ హౌస్‌కు తీసుకెళ్లాడు.
అతడు చెప్పిన మాయమాటలు నమ్మి వెంట వెళ్లిన బాధితురాలిపై కపిల్ యాదవ్‌తో పాటు మరో ఆరుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తనపై జరిగిన అత్యాచార దారణపై మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

శుక్రవారం కేసు నమోదు చేసుకున్న వెంటనే పోలీసులు బాధితురాలని వైద్య పరీక్షల నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి నమ్మబలికిన కపిల్ యాదవ్ తనతో పాటు బాధితురాలని మారుతి వాగన్ ఆర్‌లో తీసుకెళ్లినట్లు పోలీసులు వెల్లడించారు.
బాధితురాలి పశ్చిమ బంగాల్‌లోని బుర్ద్వాన్ పట్టణానికి చెందినదిగా గుర్తించారు. కుటుంబ కలహాల వల్ల భర్త నుంచి వేరు పడింది. తన కొడుకు, కుటుంబ పోషణ నిమిత్తం జీవనోపాధికై రెండు సంవత్సరాల క్రితం గుర్గావ్‌కు వలస వచ్చింది.












Click it and Unblock the Notifications