పట్టించుకోవట్లేదని .. కసిపెంచుకున్నాడు, ప్రియురాలిపై కత్తిపోట్లు పొడిచిన ప్రియుడు ...

పుణె : ఆఫీసులో పరిచయం .. క్రమంగా ప్రేమగా మారింది. కానీ ఇంతలో ఆమె అతనితో సరిగా ఉండటం లేదు. మాటలు కూడా తక్కువయ్యాయి. దీంతో తనను పక్కన పెట్టిందనే అనుమానమే పెనుభూతమైంది. తాను ప్రేమించిన అమ్మాయినే కిరాకతంగా హతమార్చిన ఘటన పుణెలో కలకలం రేపింది. నిందితుడు ఇంకా పరారీలోనే ఉన్నాడని .. త్వరలో పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.

ఆఫీసులో స్నేహం ..
పుణెలోని చాందన్‌నగర్‌లో వీణ పాట్లే (22) తన కుటుంబంతో కలిసి ఉంటున్నారు. ఇంజినీరింగ్ చేసిన వీణ .. ఓ ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. తెర్గాన్‌కు చెందిన కిరణ్ షిండే్ (25) ఐటీ ఇంజినీరింగ్ చదువు మధ్యలోనే మానేశాడు. కానీ వీణ చేసే కంపెనీలో కొలువు సంపాదించాడు. కిరణ్‌కు వీణ అక్కడే పరిచయం .. వారు వెంటనే కలిసిపోయారు. వారి స్నేహం ముదిరిపాకాన పడి ప్రేమకు దారితీసింది. ఇంతవరకు ఓకే .. కానీ ప్రేమ మైకంలో అనుమానాలు, అపోహలు కూడా ఉంటాయి. అలానే వీణ కూడా తనను పట్టించుకోవడం లేదని మదనపడ్డాడు.

22-year-old woman locates ex-boyfriend after days, he then stabs her dead

ఇంటికి పిలిచి మరీ ..
ఇంతలో వీణను మంగళవారం గదిలోకి ఆహ్వానించాడు. అక్కడ ఇద్దరికీ వాగ్వివాదం జరిగింది. అప్పటికే కోపంతో రగిలిపోయిన కిరణ్ ఓ క్షణంలో ప్రేమోన్మాదిగా మారిపోయాడు. అప్పటికే తన వద్ద ఉన్న పదునైన కత్తితో విచక్షణరహితంగా దాడిచేశాడు. వీణపై నాలుగు పోట్లు పొడవడంతో ఆమె సృహ కోల్పోయంది. ఆమె చనిపోయిందని నిర్ధారించుకొని అక్కడి నుంచి వెళ్లిపోయాడు కిరణ్. అయితే ఆమెను చూసిన ఒకరు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమె చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. వీణ హత్యకు గల కారణమేంటి అని అన్వేషించారు. ఇంతలో అతని స్నేహితుడు ప్రకాశ్ .. కిరణ్ కనిపిచండం లేదని పోలీసులను ఆశ్రయించారు. గత ఐదురోజుల నుంచి ఇంట్లో చెప్పకుండా వెళ్లిపోయాడని తెలిపారు. దీంతో కిరణ్ ప్రొఫైల్ తీస్తే .. వీణ మాజీ లవర్ అని తెలిసింది. నిందితుడిపై 302 కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని త్వరలో పట్టుకుంటామని పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+