'నాగబంధం' ట్రైలర్ రివ్యూ: విజువల్స్ తోనే చంపేశారు భయ్యా.. బాహుబలి, కాంతార, కల్కి అవుట్..!

కళ్లు చెదిరే విజువల్స్, అద్భుతమైన గ్రాండియర్‌తో 3 నిమిషాల 27 సెకన్లు అంతా అయోమయం ఈ ట్రైలర్ గురించి చెప్పాలంటే మాటలు రావడం లేదు.. భారీ సోషియో-ఫాంటసీ అడ్వెంచర్ చిత్రం నాగబంధం ట్రైలర్ కొద్దిసేపటి క్రితమే రిలీజ్ అయింది. ట్రైలర్ ఓ కొత్త సరికొత్త ఊహాజనిత ప్రపంచంలోకి తీసుకెళ్లింది. ఇలాంటి సినిమా తెలుగులోనే కాదు పాన్ ఇండియాలోనూ న భూతో.. న భవిష్యతి అన్న రేంజ్ లో ట్రైలర్ ఉంది. చూస్తుంటే విజువల్స్ కే ప్రేక్షకులు ఈ సినిమాను రెండు మూడు సార్లు చూసేలా ఉంది. ఇక కథ కరెక్ట్ గా సెట్ అయితే మాత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనమే అయ్యే అవకాశం ఉంది.

ట్రైలర్ చూస్తూంటే.. 'నాగబంధం' సినిమా మొత్తం బ్రహ్మకమలం అనే పుష్పం చూట్టూ తిరుగుతుంది. అనంత పద్మనాభస్వామి ఆలయంలోని ఆ బ్రహ్మ కమలం కోసం జరిగే పోరు నాగబంధం సినిమా అని స్పష్టం అవుతోంది. ట్రైలర్ స్టార్టింగ్ లోనే బ్రహ్మ కమలం కోసం భారీగా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.. అది మామూలు పుష్పం కాదని.. బ్రహ్మ కమలం అని పాత్రలు చెబుతున్నాయి. ఆ కమలానికి ఓ భారీ సర్పం కాపలాగా ఉందని తెలుస్తోంది. ఆ బ్రహ్మ కమలం నాతో ఉంటే ఏ శక్తి నన్ను ఆపలేదు అని రాక్షసులు కోరుకుంటున్నారు.

Nagabandham Trailer Review EyeCatching Visuals and Stunning Graphics Grand 3 27 SocioFantasy Ride

ఇదే క్రమంలో ఎంత కష్టమైనా బ్రహ్మ కమలాన్ని నేను తీసుకొస్తాను అని హీరో విరాట్ కర్ణ చెప్పిన డైలాగ్ తో స్టోరీ మరో రేంజ్ కు వెళ్తుందని అర్థం అవుతోంది. అధర్మం మితిమీరినప్పుడు ధర్మ రక్షణ కోసం భగవంతుడు అవతారం దాలుస్తాడు అని పురోహితుడు చెప్పగానే పరమ శివుడే.. నాగ సాధువుగా మారి ఆలయ రక్షణ కోసం రావడం గూస్ బంప్స్ తెప్పిస్తోంది. నాగ సాదువులు.. నాగబంధం వేసిన ఆలయానికి రక్షకులు అన్న డైలాగ్ కీలకంగా మారింది. చివరగా పెద్ద పెద్ద నాగు పాములు విజువల్ వండర్ గా కనిపిస్తున్నాయి. చూస్తుంటే మూవీ బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

ఇక ఈ మూవీలో విరాట్ కర్ణ, నభా నటేష్, ఐశ్వర్య మీనన్ ప్రధాన పాత్రల్లో నటించారు. అభిషేక్ నామా దర్శకత్వం వహించిన ఈ విజువల్ వండర్, ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో జులై 3వ తేదీన గ్రాండ్‌ గా విడుదల కానుంది. కళ్యాణ్ చక్రవర్తి డైలాగ్స్, అభే సంగీతం అందిస్తున్నారు. ఇక జూన్ 28న హైదరాబాద్‌‌ లో గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఏర్పాటుకు ప్లాన్ చేస్తున్నారు. అలాగే జులై 2న స్పెషల్ ప్రీమియర్ షో నిర్వహించనున్నారు. ఇక ఈ మూవీ నైజాం థియేట్రికల్ రైట్స్‌‌ను దిల్ రాజు సొంతం చేసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+