25 మంది జలసమాధికి అదే కారణం: మోడీ, రాహుల్ గాంధీ, సీఎం సంతాపం, ప్రాణాలతో ఇద్దరు!
బెంగళూరు: కర్ణాటకలోని మండ్య జిల్లా, పాండవపుర తాలుకా, కనగరమరళి గ్రామం సమీపంలోని కావేరీ నది కాలువలో పడిపోయిన బస్సు ప్రమాదంలో ఇప్పటి వరకు 25 మంది జలసమాధి అయ్యారు. ఇంకా ముగ్గురు, నలుగురు నదీ కాలువలలో చిక్కుకున్నారని అగ్నిమాపక సిబ్బంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
మండ్య జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదం సమాచారం తెలుసుకున్న ప్రధాని నరేంద్ర మోడీ, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్రవిషాదం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు సానుభూతి తెలుపుతూ ప్రధాని నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు రూ. 5 లక్షల చొప్పున నష్టపరిహారం అందిస్తామని సీఎం హెచ్.డి. కుమారస్వామి ప్రకటించారు.

బోట్ల సహాయంలో కావేరీ నదిలో ఆగ్నిమాపక సిబ్బంది, గజ ఈతగాళ్లు గాలిస్తున్నారు. విషయం తెలుసుకున్న కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి, ఉప ముఖ్యమంత్రి డాక్టర్ జీ. పరమేశ్వర్ అన్ని కార్యక్రమాలు రద్దు చేసుకుని కనగరమరళి గ్రామానికి చేరుకుని సహాయకచర్యలు పర్యవేక్షిస్తున్నారు. మండ్య జిల్లా ఎన్ చార్జ్ మంత్రి సీహెచ్. పుట్టరాజు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
బస్సు నదీ నిటిలో పడిపోతున్న సమయంలో అదే బస్సులో ప్రయాణిస్తున్న గిరీష్ అనే యువకుడు ఆరు సంవత్సరాల బాలుడిని కాపాడి అతను బస్సు అద్దాలు పగలగొట్టి ఇద్దరూ ప్రాణాలతో బయటపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సు సుమారు 50 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందని గిరీష్, ప్రత్యక్ష సాక్షులు సమాచారం ఇచ్చారని పోలీసులు అంటున్నారు.
బస్సు నీటిలో మునిగిపోయిన తరువాత కండెక్టర్ ఈత కొట్టుకుంటు ప్రాణాలతో బయటపడ్డాడని, డ్రైవర్ ఆచూకి మాత్రం తనకు తెలియడం లేదని ప్రాణాలతో బయటపడ్డ గీరిష్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. 2011లో ప్రమాదం జరిగిన కేఏ19, ఏ-5676 అనే నెంబర్ కలిగిన రాజ్ కుమార్ అనే బస్సును శాంభవి కొనుగోలు చేశారు.
2015 ఏప్రిల్ 13వ తేదీ శ్రీనివాస్ అనే వ్యక్తి ఇదే బస్సును శాంభవి నుంచి కొనుగోలు చేశారని పోలీసుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది. బస్సు స్టీరింగ్ లాక్ కావడం వలనే అదుపుతప్పి కావేరీ నది కాలువలో పడిపోయిందని పోలీసు అధికారుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది.












Click it and Unblock the Notifications