గుడ్ న్యూస్: వారి ఖాతాలో రూ.24వేలు.. నిరుద్యోగులకు బిగ్ బూస్ట్!
నిరుద్యోగుల కోసం బీహార్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. బీహార్ రాష్ట్రంలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు. బీహార్ రాష్ట్రంలో ఉద్యోగాల కోసం నిరీక్షిస్తున్న యువతను దృష్టిలో పెట్టుకుని ఆయన సంచలన నిర్ణయం తీసుకున్నారు.
అర్హులైన వారికి ప్రతినెల 1000 రూపాయలు
అర్హులైన నిరుద్యోగులకు ప్రతినెల 1000 రూపాయలు భృతి అందిస్తామని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ వెల్లడించారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కార్యాలయం ఇప్పటికే వెల్లడించగా గరిష్టంగా రెండేళ్లపాటు ఈ పథకం నిరుద్యోగులకు వర్తిస్తుందని పేర్కొన్నారు. దీంతో నిరుద్యోగులకు ఉద్యోగాలకు సన్నద్ధం కావటానికి కావాల్సిన ఆర్ధిక భరోసా లభిస్తుందని ఆయన పేర్కొన్నారు.

కోటి మంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యం: బీహార్ సీఎం
2025 నుంచి తమ ప్రభుత్వం ఉద్యోగ ఉపాధి కల్పనకు అధిక ప్రాధాన్యతను ఇస్తోందని ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మాట్లాడారు. రాబోయే ఐదు సంవత్సరాలలో ప్రభుత్వ ప్రైవేటు రంగాలలో కోటి మంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే తమ ప్రధాన లక్ష్యమని బీహార్ ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి స్వయం సహాయక భృతి పథకం కింద గతంలో ఇంటర్మీడియట్ పాస్ అయిన విద్యార్థులకు మాత్రమే భృతి లభించేది.
ఉద్యోగం, ఉపాధి లేని నిరుద్యోగులకు వరం
ఇప్పుడు ఉద్యోగం లేనివారికి, చదువు కొనసాగించని వారికి, స్వయం ఉపాధి లేకుండా 20 నుంచి 25 సంవత్సరాల వయస్సు ఉన్న పట్టభద్రులకు ఈ ప్రయోజనం చేకూరేలా విస్తరించినట్టు సీఎం నితీష్ కుమార్ తెలిపారు. ఇది వీరికి నైపుణ్య శిక్షణ పొందడానికి, పోటీ పరీక్షలకు సిద్ధం అవ్వడానికి దోహదం చేస్తుందని ఆయన అన్నారు. యువతకు గరిష్ట ఉపాధి అవకాశాలు కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
వారి ఖాతాలలో 24 వేలు
రెండేళ్ల మీద నిరుద్యోగ యువతకు 24 వేల రూపాయలను అందించనున్నారు. ఇక త్వరలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో ఈ నిర్ణయం నితీష్ ప్రభుత్వానికి ప్లస్ అవుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా యువతను ఆకట్టుకోవడంలో నితీష్ ప్రభుత్వం సక్సెస్ అయ్యేలా ప్లాన్ చేసిందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications