బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మరొకరు మృతి: జైలులో సయ్యద్ నదీమ్, గాయాలతోనని సీపీ ప్రకటన, బుల్లెట్ వల్ల కాదంటూ..

|
Google Oneindia TeluguNews

బెంగళూరు అల్లర్ల ఆరోపణలు ఎదుర్కొంటున్న సయ్యద్ నదీమ్ శనివారం చనిపోయాడు. గాయాలతో అతను మృతిచెందాడని బెంగళూరు పోలీస్ కమిషనర్ కమల్ పంత్ ధృవీకరించారు. సయ్యద్ మృతితో అల్లర్లలో చనిపోయిన వారి సంఖ్య నాలుగుకు చేరింది. ఈ నెల 12వ తేదీ అర్ధరాత్రి చేసిన కాల్పుల్లో ముగ్గురు చనిపోయిన సంగతి తెలిసిందే. అయితే సయ్యద్‌కు పరీక్ష చేయగా కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది.

అల్లర్ల జరిగాక సయ్యద్‌ను అరెస్ట్ చేసి జైలుకు తీసుకొచ్చారు. అయితే శుక్రవారం రాత్రి ఛాతీలో నొప్పి వస్తోందని చెప్పాడు. వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. అయితే అతను శరీరంలో గాయాల వల్ల చనిపోయాడని సీపీ తెలిపారు. కానీ తర్వాత మృతదేహనికి పరీక్ష చేయగా కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది. దేవర జీవనహళ్లిలో జరిగిన హింసకు సంబంధించి సయ్యద్ సహా ఇతరులను అరెస్ట్ చేశారు. అయితే అతను జైలులో చనిపోగా.. సయ్యద్ బుల్లెట్ గాయాలతో చనిపోయారా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. కానీ దానిని సీపీ తోసిపుచ్చారు.

24-year-old Arrested for Bengaluru Violence Dies at Hospital..

పులకేసినగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆర్ అఖండ శ్రీనివాస మూర్తి బంధువు నవీన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయోధ్యలో మందిర నిర్మాణానికి అనుకూలంగా చేసిన పోస్ట్ అగ్గిరాజేసింది. కొందరు ఎమ్మెల్యే నివాసం సహా, డీజే హల్లిలో పీఎస్ నిప్పంటించారు. ప్రైవేట్ వాహనాలను ధ్వంసం చేసి.. బీభత్సం సృష్టించారు. ఈ కేసులో సుమారు 200 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. రాత్రి జరిపిన కాల్పుల్లో ముగ్గురు చనిపోగా.. జైలులో సయ్యద్ చనిపోయారు.

English summary
One more person Syed Nadeem has died due to injuries in the abdomen, Bengaluru police commissioner Kamal Pant said on Saturday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X