అటవీ ప్రాంతానికి వెళ్లిన 25ఏళ్ల వివాహితపై గ్యాంగ్ రేప్

న్యూఢిల్లీ: ఉత్తర ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో దారుణం జరిగింది. స్నేహితురాలితో కలిసి ఇంటి సమీపంలోని అటవీ ప్రాంతానికి వెళ్లిన వివాహితపై ఇద్దరు యువకులు దాడి చేసి అనంతరం.. సామూహిక అత్యాచారం చేసిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది.

పోలీసులు తెలిపిన కథనం ప్రకారం నిందితులు బమన్ హెరీ గ్రామానికి చెందిన ఉత్తమ్ చంద్, బావర్ సింగ్‌గా గుర్తించి.. అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అత్యాచారం చేసిన వెంటనే యువకులు అక్కడి నుంచి పరారవ్వడంతో ... బాధితురాలు సివిల్ లైన్స్ పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి వయసు 25 సంవత్సరాలని పోలీసులు వెల్లడించారు.

25-yr-old gang-raped in UP

నిందితులపై పలు సెక్షన్ల క్రింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు. బాధితురాలిని వైద్య పరీక్షల కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించామన్నారు. బాధితురాలికి వివాహమైందని ఆమెకు ఒక చిన్నారి కూడా ఉందని పోలీసులు వెల్లడించారు.

ఐతే అడవికి వెళ్లిన స్నేహితురాలిని అక్కచ నుంచి వెళ్లి పోవాలని బెదిరించారని చెప్పారు. దీంతో ఆమె స్నేహితురాలు భయపడి అక్కడి నుంచి వెళ్లిపోయిందని పోలీసులు తెలిపారు. అత్యాచారం చేసే క్రమంలో ప్రతిఘటించిన యువతిపై ఇద్దరు యువకులను దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని పోలీసులు వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+