రెండువందల మంది పెళ్ళికొడుకులు సైకిళ్ళపై సవారీ ఎందుకో తెలుసా
సూరత్ :వాయు కాలుష్యంపై ప్రజలను చైతన్యం చేసేందుకుగాను పెళ్ళికొడుకు విన్యూత్నంగా ప్రదర్శన నిర్వహించారు.సంప్రదాయాలకు భిన్నంగా పెళ్ళి కొడుకులు నిర్వహించిన ఈ ర్యాలీ ఆకట్టుకొంది. కాలుష్యంపై ప్రజల్లో అవగాహాన కల్పించేందుకు గాను ఈ ర్యాలీ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
దేశ రాజధాని డిల్లీలో వాయి కాలుష్యం పెరిగి పోవడంతో స్కూళ్ళకు సెలువులు ప్రకటించారు. కాలుష్యాన్ని నివారించేందుకు ప్రణాళికలను సిద్దం చేస్తోంది డిల్లీ ప్రభుత్వం. ఇక్కడ పెరిగిన కాలుష్యంతో ప్రజలు తీవ్రంగా ఆనారోగ్య సమస్యలతో భాదపడుతున్నారు.

వాయిు కాలుష్యం డిల్లీతో పాటు సూరత్, దేశంలోని ఉత్తర, మద్య భారత దేశాల్లో ప్రధాన సమస్యగా మారింది. ఈ సమస్యపై ప్రజలను చైతన్యం చేసేందుకు వినూత్నంగా ఆలోచించిన సూరత్ వాసులు ఈ ర్యాలీ నిర్వహించారు. 258 మంది పెళ్ళి కొడుకులు బందుమిత్రులతో కలిసి సంప్రదాయాలకు విరుద్దంగా సైకిళ్ళపై పెళ్ళి మంటపాల వరకు ర్యాలీలు నిర్వహించారు.
సౌరాష్ట్ర పటేల్ సేవా సమాజ్ ఆధ్వర్యంలో సామూహిక వివాహలు జరుగుతున్నాయి. ఈ సామూహిక వివాహా కార్యక్రమాల్లో వివాహం చేసుకొంటున్న 258 మంది పెళ్ళి కొడుకులు సోమవారం ఉదయం9 గంటలకు సౌరాష్ట్ర భవన్ నుండి లోక్ సమర్పన్ రక్తదన్ కేంద్రం వద్దకు సాగింది.నగరాల్లో వాయి కాలుష్యాన్ని తగ్గించేందుకు గాను సైకిళ్ళను వినియోగించాలని పెళ్ళికొడుకులు కోరుతున్నారు.


Click it and Unblock the Notifications