26/11 ఉగ్రదాడులు: ముంబైలో రెడ్ అలర్ట్
26/11 ముంబై దాడులు జరిగి 8 ఏళ్లు అవుతున్న సందర్బంగా ముంబై నగరంలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ముంబైలోని అన్ని రైల్వే స్టేషన్లు, విలాసవంతమైన హోటల్స్, మెట్రో రైల్వే స్టేషన్లు.
ముంబై: 26/11 ముంబై దాడులు జరిగి 8 ఏళ్లు అవుతున్న సందర్బంగా ముంబై నగరంలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ముంబైలోని అన్ని రైల్వే స్టేషన్లు, విలాసవంతమైన హోటల్స్, మెట్రో రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు, సముద్ర తీర పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
ముంబైలో ఉగ్రవాదులు విరుచుకుపడి (26/11) 8 ఏళ్లు అవుతుంది. ఉగ్రవాదుల దాడిలో అనేక మంది అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. అప్పటి నుంచి 26/11 సమీపిస్తుందంటే ముంబైలో స్థానిక ప్రజలు హడలిపోతుంటారు. ముంబైలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తుంటారు.

పీవోకేలో భారత సైన్యం సర్జికల్ స్ట్రైక్ దాడులు చేసి పాక్ ఉగ్రవాదులను అంతం చేశారు. ఉగ్రవాదుల స్థావరాలు ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఎల్ వోసీ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
26/11 ముంబై దాడులు: ఇటలీ నుండి నిధులు
లష్కరే-ఏ-తోయిబా ఉగ్రవాదులు వీలుచిక్కినప్పుడల్లా భారత్ మీద ప్రతీకారం తీర్చుకుంటామని పదేపదే హెచ్చరిస్తున్నారు. వాటికి తోడుగా పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్, పాక్ ఆర్మీ చీఫ్ రహీల్ షరీఫ్ భారత్ ను ఉద్దేశించి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు.
శనివారం (26/11) ముంబై నగరంలో ఉగ్రవాదుల చేతుల్లో ప్రాణాలు కొల్పోయిన మృతులకు వారి కుటుంబ సభ్యులతో పాటు వివిధ రాజకీయ పార్టీల నాయకులు, స్వచ్చంద సంస్థలు పెద్ద ఎత్తున నివాళులు అర్పించడానికి సిద్దం అవుతున్నారు.
ఇలాంటి సమయంలో పోలీసులు గట్టిబందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు తగిన జాగ్రతలు తీసుకుంటున్నారు. ముంబై నగరంలోకి వచ్చి వెలుతున్న అన్ని వాహనాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. సున్నితమైన ప్రాంతాల్లో మఫ్టీలో పోలీసులు నిఘా వేశారు.












Click it and Unblock the Notifications