వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేరళలో వర్ష బీభత్సం: వరదలు, కొండచరియలు విరిగిపడి 26 మంది మృతి, ప్రధాని మోడీ సమీక్ష

|
Google Oneindia TeluguNews

తిరువనంతపురం: భారీ వర్షాలు, వరదలు కేరళ రాస్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. శుక్రవారం నుంచి కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాల కారణంగా వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతి చెందినవారి సంఖ్య 26కు చేరింది. మరణించినవారిలో 13 మంది కొట్టాయంకు చెందినవారు కాగా, మరో 8 మంది ఇడుక్కి జిల్లాకు చెందినవారు. మరికొన్ని జిల్లాల్లోనూ వరదల కారణంగా మరణాలు సంభవించాయి.

వరదల్లో పలువురు గల్లంతు కాగా, వారి కోసం సహాయక బృందాలు గాలింపు చేపట్టాయి. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉన్నట్లు కొట్టాయం జిల్లా కలెక్టర్ పీకే జయశ్రీ తెలిపారు. ఈ రాత్రికి మళ్లీ భారీ వర్షం కురిస్తే మళ్లీ సమస్యలు పెరగవచ్చని తెలిపారు. కాగా, రాష్ట్రంలో వర్షాలు కొనసాగుతున్నాయి.

 26 killed in Kerala, due to heavy rain, Floods: PM Modi spoke to CM Pinarayi Vijayan review the situation

భారీ వర్షాలతో వాగులు, వంకలు ఉప్పొంగడంతో అనేక ప్రాంతాల్లో వరద నీటిలోనే ఉన్నాయి. జలాశయాల్లో నీటిమట్టాలు గరిష్ట స్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం శబరిమల దర్శనానికి ఎవరూ రావొద్దని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. భారీ వర్షాల క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది.

త్రివిధ దళాల సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ బలగాలు సహాయక చర్యల్లో ముమ్మరంగా పాల్గొంటున్నాయి. భారీ వర్షాలు, వరదలపై కేరళ సీఎం పినరయి విజయన్ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. లోతట్టు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వారందరినీ కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

Recommended Video

Weather : Heavy Rains Till Oct 17 Due To Low Pressure || Oneindia Telugu

కాగా, కేరళలో వర్షాలు, వరదల కారణంగా పలువురు మృతి చెందడం పట్ల ప్రధాని నరేంద్ర మోడీ విచారం వ్యక్తం చేశారు. కేరళ రాష్ట్రంలోని పరిస్థితులపై సీఎం పినరయి విజయన్‌తో ఆయన మాట్లాడారు. కేరళలో భారీ వర్షాల నేపథ్యంలో ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్‌తో మాట్లాడాను. వరదలు, కొండచరియలు విరిగిపడి పలువురు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. క్షతగాత్రులు, బాధితుల సహాయార్థం అధికారులు సహాయసహకారాలు చర్యలు చేపడుతున్నారు. ప్రతి ఒక్కరు క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నా' ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా కేరళలో వరదల కారణంగా మరణాలు సంభవించడం పట్ల విచారం వ్యక్తం చేశారు. కేరళలో వర్షాలు, వరదల పరిస్థితిని తాము ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. కేంద్రం నుంచి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు.

English summary
26 killed in Kerala, due to heavy rain, Floods: PM Modi spoke to CM Pinarayi Vijayan review the situation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X