కేరళలో ఆరెస్సెస్ కార్యకర్త దారుణ హత్య, నరికి చంపిన దుండగులు
కన్నూర్: 26 ఏళ్ల ఆరెస్సెస్ (రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్) కార్యకర్త ఒకరు దారుణ హత్యకు గురయ్యారు. ఈ సంఘటన కేరళలోని కన్నూరులో జరిగింది. కొందరు దుండగులు ఆ కార్యకర్తను దారుణంగా చంపేశారు.
ముసుగు ధరించిన కొందరు దుండగులు శుక్రవారం దారుణంగా నరికి చంపారు. 26 ఏళ్ల శ్యాంప్రసాద్‌పై నల్లకారులో వచ్చిన ముసుగు మనుషులు పదునైన ఆయుధాలతో దాడి చేసినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. సమీపంలోని ఓ ఇంటిలోకి వెళ్లి తలదాచుకునేందుకు శ్యాంప్రసాద్ ప్రయత్నించినప్పటికీ బయటకు లాక్కొచ్చి అక్కడికక్కడే ఆయన నరికి చంపినట్టు చెప్పారు.

స్థానికులు అక్కడకు చేరుకుని అతన్ని ఆసుపత్రికి తరలించే లోపే కన్నుమూసినట్టు చెబుతున్నారు. కాగా, ఇది రాజకీయ హింసగా అనుమానిస్తున్నామని, అయితే ప్రధాన కారణం ఏమిటనే విషయమై దర్యాప్తు జరుపుతున్నామని జిల్లా పోలీసు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications