Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

vande bharat sleeper: వందే భారత్ స్లీపర్లపై కేంద్రం కీలక నిర్ణయం..! త్వరలో ఇవన్నీ..!

ప్రస్తుతం భారత్ లో అత్యంత అధునాతన ఫీచర్లు, సౌకర్యవంతంగా తయారు చేసిన వందే భారత్ స్లీపర్ (vande bharat sleeper) రైళ్లకు డిమాండ్ పెరుగుతోంది. ఇప్పటికే భారీ డిమాండ్ తో నడుస్తున్న వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లకు స్లీపర్ ఫీచర్ ను జోడించి తయారు చేసిన ఈ కొత్త రైళ్లకు లభిస్తున్న ఆదరణను గమనిస్తున్న కేంద్రం.. మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తాజాగా లోక్ సభలో దీనిపై ప్రకటన చేశారు.

కొత్తగా 260 వందే భారత్ స్లీపర్ రైళ్లు (vande bharat sleeper)

ప్రస్తుతం రైల్వే ప్రయాణికులు ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య దూర ప్రయాణంలో సౌకర్యవంతంగా లేని రైళ్లు. అలాగే దూర ప్రయాణాల్లో భద్రత. ఈ రెండు సమస్యలకు పరిష్కారంగా వందే భారత్ స్లీపర్ రైళ్లను ప్రమోట్ చేయాలని భావిస్తున్న కేంద్రం.. స్వయంగా 260 రైళ్లను తయారు చేయాలని నిర్ణయించింది. బీఈఎంఎల్, ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీకి ఈ మేరకు ఆర్డర్లు ఇవ్వబోతున్నారు. అధునాతన సౌకర్యాలతో పాటు భద్రతను కూడా జోడిస్తూ ఈ రైళ్లను తయారు చేయబోతున్నట్లు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ పార్లమెంట్ లో తెలిపారు.

260 Vande Bharat Sleeper Trains Planned to Modernize Long-Distance Rail Travel

భద్రంగా సుదూర ప్రయాణం

క్షేత్రస్ధాయిలో డిమాండ్, పరిస్ధితుల ఆధారంగా ఈ వందే భారత్ స్లీపర్ రైళ్లను దశల వారీగా అందుబాటులోకి తెస్తామని రైల్వే మంత్రి ప్రకటించారు. ఈ తాజా వందే భారత్ స్లీపర్ రైళ్లలో సెమీ పర్మనెంట్-జెర్క్ ఫ్రీ కప్లర్లు, యాంటీ క్లైంబర్లు, కవచ్ రక్షణ వ్యవస్థ, ప్రమాదాల్ని తట్టుకునే డిజైన్, ఫైర్ బ్యారియర్ డోర్లు, ఎలక్ట్రిక్ కేబినెట్లు, లెట్రిన్ లలో ఏరోసోల్ ఆధారిత ఫైర్ డిటెక్షన్, సప్రెషన్ వ్యవస్దలు, సీసీటీవీ కవరేజ్ వంటి ఫీచర్లు ఉన్నట్లు రైల్వే శాఖ మంత్రి తెలిపారు.

260 Vande Bharat Sleeper Trains Planned to Modernize Long-Distance Rail Travel

సౌకర్యవంతమైన ప్రయాణం

వందే భారత్ ఎక్స్ ప్రెస్ ల తరహాలోనే ఈ స్లీపర్ రైళ్లను సైతం 180 కిలోమీటర్ల గరిష్ట వేగంతో డిజైన్ చేస్తారు. అయితే పట్టాలపై వెళ్లే వేగాన్ని మాత్రం గంటకు 160 కిలోమీటర్లకు నియంత్రిస్తారు. అలాగే వీటిలో ప్రయాణికుల సౌకర్యం కోసం ఆటోమేటిక్ ప్లగ్ డోర్లు, సెంట్రల్ మానిటర్డ్ కోచ్ వ్యవస్థ, ఎయిర్ కండిషన్ యూనిట్లు, యూవీసీ ఆధారిత డిస్ ఇన్ ఫెక్షన్ సాంకేతికత వంటి ఫీచర్లను కూడా అమల్లోకి తీసుకువస్తారు. దీంతో ప్రయాణికులు ఎంతదూరమైనా హాయిగా, భద్రంగా ప్రయాణాలు చేయవచ్చు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+