వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యూపీలో ఘోర ప్రమాదం, ట్రాక్టర్ బోల్తా..27 మంది మృతి, ప్రధాని మోడీ సంతాపం

|
Google Oneindia TeluguNews

ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కాన్పూర్‌లో ట్రాక్టర్ బోల్తా పడింది. దీంతో 27 మంది చనిపోయారు. వీరిలో 11 మంది చిన్నారులు, 11 మంది మహిళలు ఉన్నారు. ట్రాక్టర్ ట్రాలీ బోల్తా పడటంతో ప్రమాదం జరిగింది. మరో 30 మంది వరకు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఫతేపూర్ నుంచి ఘాటమ్‌పూర్‌కు యాత్రికులు వెళుతున్నారు. చంద్రికా దేవి ఆలయంలో జరిగే ముందాన్ వేడుక కోసం వెళుతున్నారు. అయితే ట్రాక్టర్ భాదెనా గ్రామంలో బోల్తా పడింది. వెంటనే సహాయక చర్యలను చేపట్టారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆ ట్రాక్టర్‌లో దాదాపు 60కి పైగా ఉన్నారు.

 27 dead as tractor overturns in UPs Kanpur

ఘటనపై ప్రధానమంత్రి కార్యాలయం స్పందించింది. ప్రమాదం దురదృష్టకరం అని అభిప్రాయపడింది. చనిపోయిన వారికి సంతాపం తెలిపింది. గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ప్రధాని మోడీ అభిలషించారు. వారికి స్థానిక అధికారులు సాయం చేస్తారని తెలిపారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.

ప్రధానమంత్రి సహాయనిధి నుంచి ఒక్కో కుటుంబానికి రూ.2 లక్షల సాయం అందజేస్తామని ప్రకటించారు. గాయపడ్డవారికి రూ.50 వేల చొప్పున అందజేయనుంది.

ప్రమాదం దిగ్బ్రాంతికి గురిచేసిందని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. ఘటనా స్థలానికి జిల్లా యంత్రాంగం చేరుకుందని.. సహాయక చర్యలు చేపడుతుందని వివరించారు. గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రమాదం తర్వాత సహాయక చర్యలను సీఎం దగ్గరుండి మరీ పర్యవేక్షిస్తున్నారు.

English summary
27 people, including 11 children and 11 women, died as a tractor-trolley overturned on the road in Uttar Pradesh's Kanpur on Saturday. 30 others were injured who are being treated at a hospital.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X