పీహెచ్‌డీ విద్యార్థిని మంజుల అనుమానాస్పద మృతి

ఢిల్లీ ఐఐటీ క్యాంపస్‌లో పీహెచ్‌డీ ఫైనల్ ఇయర్ విద్యార్థిని మంజుల దేవక్(27) అనుమానాస్పద మృతి కలకలం సృష్టించింది. జల వనరులపై పీహెచ్‌డీ చేస్తున్న మంజుల తన గదిలో మంగళవారం ఆత్మహత్య చేసుకుంది.

న్యూఢిల్లీ: ఢిల్లీ ఐఐటీ క్యాంపస్‌లో పీహెచ్‌డీ ఫైనల్ ఇయర్ విద్యార్థిని మంజుల దేవక్(27) అనుమానాస్పద మృతి కలకలం సృష్టించింది. జల వనరులపై పీహెచ్‌డీ చేస్తున్న మంజుల తన గదిలో మంగళవారం ఆత్మహత్య చేసుకుంది.

క్యాంపస్‌లోని నలంద అపార్ట్‌మెంట్‌లోని తన గదిలో ఫ్యాన్‌కు మంజుల ఉరివేసుకుని చనిపోయిందని ఢిల్లీ పోలీసులు తెలిపారు. అయితే, ఇది హత్యా? ఆత్మహత్యా? అనే విషయం ఇప్పుడే చెప్పలేమని అన్నారు.

27-Year-Old PhD Student Found Dead In IIT Delhi Campus

గదిలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించకపోవడంతో దీనిని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. పోస్టుమార్టం రిపోర్ట్ అనంతరం దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని చెప్పారు.

కాగా, మధ్యప్రదేశ్ భోపాల్‌కు చెందిన మంజులకు కొన్నేళ్ల కిందటే రితేష్ విర్హా అనే వ్యక్తితో వివాహమైంది. మంజుల మరణవార్తను ఆమె భర్త, తల్లిదండ్రులకు చేరవేశామని పోలీసులు తెలిపారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+