వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

2జీ డ్రగ్ వచ్చేసింది.. తొలుత దిల్లీ ఆసుపత్రులలో వినియోగం

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

కోవిడ్ లక్షణాలున్నవారికి చికిత్స చేసేందుకు దేశీయంగా తయారుచేసిన ఔషధాన్ని భారత్‌లో పంపిణీ ప్రారంభించారు.

డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీఓ) రూపొందించిన 2-డీజీ అనే ఈ ఔషధాన్ని తొలుత రాజధాని దిల్లీలోని ఆసుపత్రులలో వినియోగిస్తున్నారు.

2-డీజీ మొదటి బ్యాచ్ మందులను కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్థన్‌కు అందించినట్లు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు.

https://twitter.com/rajnathsingh/status/1394211948925915136

కోవిడ్-19తో బాధపడుతున్నవారు కోలుకోవడంలో ఇది అత్యంత కీలకంగా పనిచేస్తుందని ప్రభుత్వం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

అయితే, కోవిడ్ చికిత్స కోసం అత్యవసరంగా ఈ మందుకు ఆమోదం పలకడంపై కొందరు విమర్శకులు హెచ్చరిస్తున్నారు. దీని పనితీరుకు సంబంధించి తగినంత డాటా ఇంకా అందుబాటులో లేదని అంటున్నారు.

2-డీజీగా పిలుస్తున్న ఈ '2 డియాక్సీ డి గ్లూకోజ్' మందును డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్‌తో కలిసి డీఆర్‌డీవో అభివృద్ధి చేసింది.

''ఆసుపత్రి పాలయిన కోవిడ్ రోగులు ఈ మందు వాడిన తరువాత తొందరగా కోలుకున్నట్లు క్లినికల్ ట్రయల్స్‌లో తేలింది.. అలాగే, కృత్రిమ ఆక్సిజన్ అందివ్వాల్సిన అవసరాన్నీ ఇది తగ్గించింద''ని ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది.

అయితే, హ్యూమన్ ట్రయల్స్‌కు సంబంధించిన ఈ డ్రగ్ డాటా అందుబాటులో లేదని, కాబట్టి దీని సామర్థ్యంపై సందేహాలున్నాయని పలువురు నిపుణులు అంటున్నారు.

నిజానికి డీ2 అనేది క్యాన్సర్ చికిత్స కోసం రూపొందించిన ఔషధం అని.. చాలాకాలంగా దీన్ని చికిత్సలలో వాడుతున్నా ఇప్పటి వరకు ఆమోదం పొందలేదని చెబుతున్నారు.

కోవిడ్

కాగా కోవిడ్-19కి ఇంతవరకు ప్రత్యేకంగా చికిత్స లేదు. వ్యాధి లక్షణాలు తగ్గించడానికి వాడుతున్న మందులకు కూడా భారత్‌లో తీవ్రమైన కొరత ఉంది.

ఇప్పటివరకు 2.4 కోట్ల కేసులు, 2,70,000 మరణాలతో భారత్ ప్రపంచంలో ఈ వ్యాధి వల్ల తీవ్రంగా దెబ్బతిన్న దేశాలలో ఒకటిగా నిలిచింది.

కోవిడ్ సెకండ్ వేవ్ భారత్‌లో అనేక ప్రాంతాలలో విజృంభించింది.

ప్రస్తుత కోవిడ్ సంక్షోభం నుంచి వేగంగా బయటపడడానికి సహకరించే వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా భారత్‌లో అనుకున్నంత వేగంగా సాగడం లేదు.

''పెద్ద సంఖ్యలో రోగులకు ఆక్సిజన్ అవసరమవుతోంది. కరోనా ప్రభావిత కణాలను కోలుకునేలా చేయడంలో ఈ ఔషధం పనిచేస్తుంది. ఫలితంగా ఎందరో ప్రాణాలను నిలపొచ్చు. ఆసుపత్రిలో ఉండాల్సిన అవసరాన్ని, సమయాన్ని కూడా ఈ మందు తగ్గిస్తుంది'' అని ప్రభుత్వ ప్రకటన ఒకటి తెలిపింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
2G drug arrived,Initially used in Delhi hospitals
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X