తెలుగు స్టార్ హీరోకి మర్చిపోలేని హిట్స్ ఇచ్చిన విజయ్ తండ్రి.. ఆ సినిమాలు ఇవే ???

వెండితెరపై కోట్లాది మంది హృదయాలను గెలుచుకుని స్టార్ హీరోగా రాణిస్తూనే.. ఆ ప్రజాదరణతో రాజకీయ సింహాసనాన్ని అధిరోహించడం అనేది ఒక అద్భుతమైన ప్రయాణం. దక్షిణాది రాజకీయాల్లో ఎన్టీఆర్ (NTR), ఎంజీఆర్ (MGR) సృష్టించిన చరిత్రను ఇప్పుడు దళస్టార్ పతి విజయ్ (Vijay) పునరావృతం చేసి చూపించారు. Vijay ఇప్పుడు రాజకీయ రంగంలోనూ తన ప్రభావాన్ని గట్టిగా చూపిస్తున్నారు. ఆయన స్థాపించిన Tamilaga Vettri Kazhagam (TVK) పార్టీ తాజా అసెంబ్లీ ఎన్నికల ట్రెండ్‌లలో 100కు పైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతూ చరిత్ర సృష్టించే దిశగా దూసుకెళ్తోంది. దశాబ్దాలుగా డీఎంకే, అన్నాడీఎంకే మధ్య సాగిన రాజకీయ పోరుకు ఈ ఫలితాలు కొత్త మలుపు తిప్పినట్టుగా కనిపిస్తున్నాయి.

ఈ రాజకీయ సంచలనంతో పాటు, విజయ్ కుటుంబ నేపథ్యం కూడా మళ్లీ చర్చలోకి వచ్చింది. ముఖ్యంగా ఆయన తండ్రి S. A. Chandrasekhar సినీ ప్రయాణం, తెలుగు సినీ పరిశ్రమతో ఉన్న అనుబంధం ఆసక్తికరంగా మారింది. దర్శకుడిగా తమిళంలో ప్రారంభించిన ఆయనకు, తెలుగులో పెద్ద బ్రేక్ ఇచ్చింది Chiranjeevi అనే విషయం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. 1981లో విడుదలైన Chattaniki Kallu Levu చిత్రం ఇద్దరి కెరీర్‌లలోనూ కీలక మైలురాయిగా నిలిచింది. ఆ కాలంలో పెద్ద విజయం సాధించిన ఈ సినిమా, చిరంజీవి స్టార్‌డమ్‌ను మరింత బలోపేతం చేయడమే కాకుండా, చంద్రశేఖర్‌ను టాలీవుడ్‌లో గుర్తింపు పొందిన దర్శకుడిగా నిలబెట్టింది. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన 'పల్లెటూరి మొనగాడు', 'దేవాంతకుడు' వంటి సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలు సాధించాయి.

vijay-father-chandrasekhar-and-chirajeevi-relation-became-talk-of-the-topic-in-cine-and-political-ma

ఇక విజయ్ విషయానికి వస్తే, తండ్రి వారసత్వంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా, తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను నిర్మించుకున్నారు. Rajinikanth తర్వాత తమిళనాడులో భారీ మాస్ ఫాలోయింగ్ సంపాదించిన హీరోగా విజయ్ ఎదిగారు. 'గిల్లీ', 'తుపాకి', 'మాస్టర్', 'లియో' వంటి సినిమాలతో ఆయన బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించారు. ముఖ్యంగా యువతలో ఆయనకు ఉన్న క్రేజ్ రాజకీయాల్లోకి రావడానికి బలమైన పునాది అయింది.

234 స్థానాలున్న అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 118 స్థానాలు అవసరం. ప్రస్తుతం వస్తున్న ట్రెండ్స్ ప్రకారం, విజయ్ పార్టీ వందకు పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. Edappadi K. Palaniswami నేతృత్వంలోని అన్నాడీఎంకే కూటమి రెండవ స్థానంలో ఉంది. మరోవైపు ముఖ్యమంత్రి M. K. Stalin నేతృత్వంలోని డీఎంకే కేవలం మూడో స్థానంలో కొనసాగుతుండడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. దీంతో ఈ వ్యవహారం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+