తమిళిసైకి షాక్.. విజయ్ విక్టరీపై అన్నామలై రియాక్షన్!

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ప్రకంపనలు కొనసాగుతున్నాయి. దశాబ్దాలుగా రాష్ట్రాన్ని ఏలుతున్న ద్రవిడ దిగ్గజాలకు 'దళపతి' విజయ్ చుక్కలు చూపించగా, మరోవైపు బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ముఖ్యంగా తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మూడో స్థానానికి పడిపోవడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది.

తెలంగాణ గవర్నర్ పదవికి రాజీనామా చేసి, ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన తమిళిసై సౌందరరాజన్‌కు మైలాపూర్ ఓటర్లు షాక్ ఇచ్చారు. మైలాపూర్ నియోజకవర్గంలో ఆమె ప్రస్తుతం మూడో స్థానంలో కొనసాగుతున్నారు. ఇక్కడ విజయ్ పార్టీ (TVK) అభ్యర్థి వెంకటరమణన్ 68 వేలకు పైగా ఓట్లతో దూసుకుపోతుండగా, డీఎంకే అభ్యర్థి రెండో స్థానంలో ఉన్నారు. తమిళిసై 31,372 ఓట్లతో వెనుకబడి ఉండటం బీజేపీ శ్రేణులను నిరాశకు గురిచేస్తోంది.

Tamil Nadu Election Results 2026 Ex-Governor Tamilisai Trailing in Mylapore as Vijay s TVK Sweeps 106 Seats

తరం మారింది.. తీర్పు మారింది - అన్నామలై

తమిళనాడులో మారుతున్న రాజకీయ సమీకరణలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె. అన్నామలైఆసక్తికరంగా స్పందించారు. విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK) సాధించిన అద్భుత విజయాన్ని ఆయన స్వాగతించారు. "తమిళనాడు ప్రజల తీర్పుకు వంగి నమస్కరిస్తున్నాను. వంశపారంపర్య రాజకీయాలను, ఓట్ల కొనుగోళ్లను ప్రజలు తిరస్కరించారు. ఇది రాజకీయాల్లో ఒక తరం మారిన తీర్పు" అని ఆయన అభివర్ణించారు. స్టాలిన్, సీమాన్ వంటి నేతల ఓటమిపై ఆయన సానుభూతి వ్యక్తం చేస్తూనే, విజయ్‌కు అభినందనలు తెలిపారు.

మెజారిటీ మార్కుకు చేరువలో విజయ్..

234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీలో విజయ్ పార్టీ టీవీకే ఏకంగా 108 స్థానాల్లో ఆధిక్యంలో ఉండి రికార్డు సృష్టించింది. మ్యాజిక్ ఫిగర్ 118కి కేవలం 10 అడుగుల దూరంలో నిలిచింది. విజయ్ తాను పోటీ చేసిన పెరంబలూర్, తిరుచ్చి ఈస్ట్ రెండు చోట్లా భారీ మెజారిటీతో విజయం సాధించారు. మరోవైపు అధికార డీఎంకే 70 స్థానాలకే పరిమితం కాగా, ఏఐఏడీఎంకే 56 చోట్ల ముందంజలో ఉంది. ముఖ్యమంత్రి స్టాలిన్‌తో సహా పలువురు సీనియర్ మంత్రులు వెనుకంజలో ఉండటం గమనార్హం.

సాంప్రదాయ రాజకీయాలకు చెక్..

ఈ ఫలితాలు తమిళనాడులో ద్రవిడ పార్టీల ఆధిపత్యానికి ముగింపు పలుకుతున్నట్లు కనిపిస్తున్నాయి. అన్నామలై తన పార్టీ కార్యకర్తల కృషిని అభినందిస్తూనే, ఎన్డీఏ (NDA) తరపున గెలిచిన అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఓడిపోయిన వారు నిరాశ చెందకుండా పోరాడాలని పిలుపునిచ్చారు. మొత్తానికి విజయ్ రాకతో తమిళనాడు రాజకీయ చిత్రం పూర్తిగా మారిపోయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+