కృత్తికలో సూర్యుడు, దశ, దిశ మారుతున్న మీనం, సింహ, కర్కాటకం, వృశ్చిక రాశులవారు

జ్యోతిషశాస్త్రంలో గ్రహాల రాజుగా పిలవబడే సూర్యుడు, అతి త్వరలో పరాక్రమానికి చిహ్నమైన కృత్తిక నక్షత్రంలోకి అడుగుపెట్టబోతున్నాడు. మే 11 సోమవారం సాయంత్రం నుంచి ప్రారంభమయ్యే ఈ సంచారం వల్ల, సూర్యుడి ప్రతాపం కొన్ని రాశుల వారికి వరంగా మారనుంది. ఆర్థిక కష్టాలు తొలగిపోయి, మానసిక ప్రశాంతత చేకూరుతుంది. అన్నిరకాలుగా ప్రయోజనాలు కలుగుతాయి. ఆయా రాశుల వివరాలను తెలుసుకుందాం. మే 25 వరకు కొనసాగే ఈ నక్షత్ర సంచారం ఈ రాశుల జీవితాల్లో వెలుగులు నింపబోతోంది.

మీన రాశి వారికి అఖండ ధనయోగం

మీన రాశి వారికి ఈ సమయం 'ధన వర్షం' కురిపించబోతోంది. ఊహించని మార్గాల ద్వారా ఆదాయం సమకూరుతుంది. చాలా కాలంగా మొండిబాకీలుగా మిగిలిపోయిన డబ్బు ఈ సమయంలో చేతికి అందుతుంది. ఆర్థిక ఇబ్బందుల నుంచి పూర్తిగా విముక్తి లభిస్తుంది. స్నేహితులు లేదా సన్నిహితుల సహకారంతో లాభదాయకమైన పనులు పూర్తవుతాయి.

Horoscope pisces leo cancer scorpio see destiny shift as sun enters krittika nakshatra

కర్కాటక రాశి వారికి ఆత్మవిశ్వాసం ఎక్కువ

కర్కాటక రాశి వారికి ఈ 15 రోజులు వృత్తిపరంగా తిరుగులేని కాలం. సూర్యుడి ప్రభావంతో వీరు చేసే ప్రతి పనిలోనూ స్పష్టత ఉంటుంది. కార్యాలయాల్లో నాయకత్వ లక్షణాలకు ప్రశంసలు దక్కుతాయి. ఆత్మవిశ్వాసం రెట్టింపు అవ్వడం వల్ల కఠినమైన నిర్ణయాలను కూడా సులభంగా తీసుకుంటారు. మానసిక ఒత్తిడి తగ్గి, కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది.

సింహ రాశివారికి ఇది సువర్ణ కాలం

సొంత రాశి అధిపతి సూర్యుడు కావడంతో, సింహ రాశి వారికి అదృష్టం తలుపు తట్టబోతోంది. వ్యాపార, ఉద్యోగాల్లో కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో అద్భుతమైన ప్రతిభను కనబరుస్తారు. విదేశాలకు వెళ్లాలనుకునే వారి ప్రయత్నాలు ఫలిస్తాయి. కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది.

వృశ్చిక రాశివారికి ప్రశాంతత లభిస్తుంది

వృశ్చిక రాశి వారికి గత కొంతకాలంగా వేధిస్తున్న వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. కుటుంబంలో ఉన్న విభేదాలు తొలగిపోయి సఖ్యత ఏర్పడుతుంది.ఉద్యోగ వేటలో ఉన్న వారికి ఆకర్షణీయమైన జీతంతో కొత్త అవకాశాలు వస్తాయి. ప్రేమ జీవితం బాగుంటుంది, భాగస్వామితో ఉన్న మనస్పర్థలు తొలగిపోయి మానసిక ప్రశాంతత లభిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+