మమత ఆఫీసుకు నిప్పు.. బెంగాల్ లో టెన్షన్ టెన్షన్..!!

బెంగాల్ లో బీజీపీ చరిత్ర సృష్టించింది. బెంగాల్ లో ఎగ్జిట్ పోల్స్ కు తగ్గట్టుగానే అంచనాలు వెలువడుతున్నాయి. మొత్తం 294 అసెంబ్లీ స్థానాలకు గాను 190 స్థానాల్లో పూర్తి ఆధిక్యం ప్రదర్శించింది. దాంతో మమత కంచుకోటను బద్దలుకొట్టి రాష్ట్రంలోనే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది.

మరోవైపు రాష్ట్రంలో తొలిసారి బీజేపీ అధికారం చేపట్టనున్న నేపథ్యంలో బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మమతా బెనర్జీ ఆఫీస్ కు నిప్పు పెట్టారు గుర్తు తెలియని వ్యక్తులు. బరబానిలోని టీఎంసీ ఆఫీస్ కు నిప్పు పెట్టారు. ఈ మేరకు పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. మంటలు భారీగా ఎగిసిపడిన నేపథ్యంలో ఆఫీస్ బూడిదైంది. అటు అసన్ సోన్ లోనూ టీఎంసీ ఆఫీస్ పై కొందరు దాడికి పాల్పడినట్లు స్పష్టం అవుతోంది. ఆఫీస్ లోని కుర్చీలు, టేబుల్స్ ను ధ్వంసం చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. ఇక రాష్ట్రవ్యాప్తంగా కేంద్ర బలగాల్ని ఇప్పటికే మోహరించిన విషయం తెలిసిందే.

దాదాపు 15 ఏళ్లుగా బెంగాల్ లో ఎదురులేని శక్తిగా నిలిచిన మమతా బెనర్జీకి తాజాగా కాషాయ పార్టీ గట్టి షాక్ ఇచ్చిందనే చెప్పాలి. గత రెండు దఫాల్లో బెంగాల్ లో విక్టరీ కోసం బీజేపీ తీవ్రంగా శ్రమించింది. కానీ అది సాధ్యపడలేదు. అయితే ఎట్టకేలకు ఈసారి బెంగాల్ లో బీజేపీ జెండా రెపరెపలాడింది. ఈ విజయంలో మోదీ- అమిషా కృషి చాలానే ఉందని తెలుస్తోంది.

TMC Office in Barabani Set Ablaze Amidst Bengal Assembly Election Results Major Tension Barabani

ఇక బెంగాల్ లో బీజేపీ తొలిసారి అధికారంలోకి వస్తున్న నేపథ్యంలో సీఎం పదవి ఎవరికి దక్కుతుంది..? అనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ప్రతిపక్ష నేతగా ఉన్న సువేందు అధికారే ఆ ఛాన్స్ అధికంగా ఉన్నట్లు స్పష్టం అవుతోంది. సువేంధు అధికారి ఒకప్పుడు మమత అనుచరుడిగా ఉండి టీఎంసీ పార్టీని బలోపేతం చేశారు. ఆ తర్వాత బీజేపీలో చేరి ఇప్పుడు సీఎం స్థాయికి ఎదిగారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+