2జీ స్పెక్ట్రమ్ కేసు: విచారణకు హాజరైన కనిమొళి, 21న తుది తీర్పు

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: 2జీ స్పెక్ట్రమ్ కేసులో ఈనెల 21వ తేదీన తుది తీర్పును ప్రకటించనున్నట్లు ఢిల్లీలోని పాటియాలా కోర్టు వెల్లడించింది. ఈ కేసులో ఎంపీ కనిమొళి మంగళవారం కోర్టు విచారణకు హాజరయ్యారు.

2జీ స్పెక్ట్రమ్ కేసులో ఆమె నిందితురాలిగా ఉన్నారు. తుది తీర్పు కోసం డిసెంబర్ 21 వరకు వేచి చూద్దామని ఆమె ఈ సందర్భంగా వ్యాఖ్యనించారు. గతంలో పలుమార్లు ఈ కేసు వాయిదా పడింది.

2G scam: Special CBI court to deliver verdict on December 21

2జీ కేసులో నవంబర్ 7వ తేదీన చివరి విచారణ జరిగింది. అయితే ఆ విచారణలో తుది తీర్పు తేదీని డిసెంబర్ 5గా పాటియాలా కోర్టు పేర్కొంది. రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలకు సంబంధం ఉన్న మూడు ప్రధాన స్పెక్ట్రమ్ కేసుల్లో సీబీఐ కోర్టు తన తీర్పును వెల్లడించాల్సి ఉంది.

టెలికాం శాఖ మాజీ మంత్రి ఏ.రాజా, ఎంపీ కనిమొళిలు ఆ కేసు ఛార్జ్‌షీట్‌లో నిందితులుగా ఉన్నారు. 2జీ స్పెక్ట్రమ్ కింద 122 లైసెన్సులు ఇవ్వడం వల్ల సుమారు ప్రభుత్వానికి రూ.31 వేల కోట్ల నష్టం వాటిల్లినట్లు సీబీఐ తన కేసులో ఆరోపణలు చేసింది.

వాస్తవానికి ఈ కేసులో గత అక్టోబర్ 25వ తేదీనే సీబీఐ కోర్టు తీర్పును ఇవ్వాల్సి ఉండగా, డాక్యుమెంట్లు ఎక్కువగా ఉన్న కారణంగా నవంబర్ 7వ తేదీకి వాయిదా వేసింది.

2జీ స్పెక్ట్రమ్ కుంభకోణంపై సీబీఐ రెండు కేసులు నమోదు చేయగా, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) మరో కేసును వేసింది. రాజా, కనిమొళితో పాటు మరో 19 మందిపై 2014లో ఈడీ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A special court Tuesday announced December 21 to be the final judgment day in the 2G spectrum allocation scam cases in which former telecom minister A Raja and DMK MP Kanimozhi are among the key accused.Special Judge OP Saini, who is exclusively dealing with the cases related to the 2G spectrum scam, adjourned the hearing Tuesday but set the date for pronouncing the judgement in perhaps the biggest corruption case in independent India, for December 21.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి