పార్టీ చేసుకున్నారు.. ఆ తర్వాత తలుపేసుకున్నారు.. తెరిచి చూస్తే 'మృతి'

తెల్లవారుజామున జెన్నీ వచ్చేసరికి మాత్రం ఇద్దరు అపస్మారక స్థితిలో పడిపోయి ఉన్నారు. డ్రగ్స్ ఓవర్ డోస్ తో పాటు అధికంగా మద్యం సేవించడం వల్లే ఇద్దరు చనిపోయారని వైద్యులు తెలిపారు.

న్యూఢిల్లీ: పార్టీకి వెళ్లి వచ్చిన ఇద్దరు యువతులు.. ఆ తర్వాత కొద్దిసేపటికే అనుమానస్పద స్థితిలో మృతి చెందారు. అయితే విపరీతంగా ఆల్కహాల్ సేవించడంతో పాటు డ్రగ్స్ ఓవర్ డోస్ కావడంతోనే వీరు మృతి చెంది ఉంటారన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మృతి చెందిన యువతులు క్లారా, రకీమ్ లు మిజోరాంకి చెందినవారిగా గుర్తించారు.

దక్షిణ ఢిల్లీలోని వసంత విహార్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. స్నేహితురాలితో కలిసి పార్టీ చేసుకున్న వీరు రాత్రంతా ఆల్కాహాల్, డ్రగ్స్ సేవించారు. పార్టీ నుంచి మధ్యలోనే వెళ్లిపోయిన స్నేహితురాలు మరుసటి రోజు తెల్లవారుజామున 6గం.కు వచ్చి గదికి వచ్చింది.

2mizoram girls die after partying cops suspect drug overdose

ఇద్దరు ఎంతకీ తలుపులు తెరవకపోవడంతో.. అనుమానం వచ్చి కిటికీ గుండా లోపలికి వెళ్లింది. అప్పటికే వారిద్దరూ అపస్మారక స్థితిలో నేలపై పడిపోయి ఉన్నారు. ఆపై ఇద్దరిని ఆసుపత్రికి తరలించగా వారిద్దరు అప్పటికే చనిపోయారని వైద్యులు తెలిపారు.

కాగా, కొన్నేళ్లు బీపీఓలో జాబ్ చేసిన క్లారా ప్రస్తుతం ఖాళీగానే ఉంటోంది. రకీమ్ మాత్రం లక్నోలో పనిచేస్తూ వీకెండ్స్ లో ఢిల్లీకి వస్తుంటుంది. వీరిద్దరికి కొన్నేళ్లుగా పరిచయం ఉండటంతో తరుచు కలుస్తుంటారు. జెన్నీ అనే మరో స్నేహితురాలితో కలిసి ఇటీవల వీరు పార్టీ చేసుకున్నారు. రాత్రి 11 గంటల వరకు పార్టీ చేసుకున్నామని, ఆ తర్వాత తాను వెళ్లిపోయానని జెన్నీ చెప్పింది.

అప్పటికీ అధికంగా ఆల్కాహాల్ సేవించిన క్లారా, రకీమ్ ఇంకా తాగుతూనే ఉన్నారు. అలా ఎప్పటివరకు తాగారన్నది తెలియదు. తెల్లవారుజామున జెన్నీ వచ్చేసరికి మాత్రం ఇద్దరు అపస్మారక స్థితిలో పడిపోయి ఉన్నారు. డ్రగ్స్ ఓవర్ డోస్ తో పాటు అధికంగా మద్యం సేవించడం వల్లే ఇద్దరు చనిపోయారని వైద్యులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+