Fake CBI: మట్కా కింగ్ కే మస్కా, అసలైన కిలాడీలు, దెబ్బకు కిడ్నాప్ !

బెంగళూరు/కలబురిగి: మట్కాను బ్యాన్ చేసినా కొందరు దానికి బానిసలు అయ్యి సీక్రేట్ గా ఆడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. మట్కా బుక్కీగా పేరు సంపాధించుకున్న వ్యక్తి బాగా డబ్బులు సంపాధించాడు. మట్కా బ్యాన్ తో అతను కొంతకాలం సీక్రేట్ గా బుక్కీగా పని చేశాడు. మట్కా వ్యాపారం దిగజారిపోవడంతో అతను వ్యాపారం చేస్తున్నాడు. పోలీసు డ్రస్ వేసుకున్న నిందితులు మాజీ మట్కా బుకీ దగ్గరకు వెళ్లారు. మేము సీబీఐ అధికారులు, నిన్ను విచారణ చెయ్యాలని చెప్పి కారులో పిలుచుకుని వెళ్లారు. మాజీ మట్కా బాస్ ను బ్లాక్ మెయిల్ చేసిన ముగ్గురు అతన్ని రూ.11 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. డబ్బులు ఇవ్వకపోతే జైలుకు పంపిస్తామని నిందితులు అతన్ని బెదిరించారు. ధితుడు తప్పించుకుని వెళ్లి పోలీసులకు మ్యాటర్ చెప్పడం ఇప్పుడు ముగ్గరు కిలాడీలకు 70 ఎంఎం సినిమా కనపడుతోంది.

 మాజీ మట్కా బుక్కీ

మాజీ మట్కా బుక్కీ

కర్ణాటకలోని కలబురిగిలో యంకప్ప అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. మట్కాను బ్యాన్ చేసినా కొందరు దానికి బానిసలు అయ్యి సీక్రేట్ గా ఆడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. మట్కా బుక్కీగా పేరు సంపాధించుకున్న యంకప్ప డబ్బులు బాగా సంపాధించాడు. స్థానికులు యంకప్పను పేరుతో పిలవకుండా మట్కా బుక్కీగానే ఎక్కువగా పిలుస్తున్నారు.

 మట్కా మాజీ బుక్కీ మీద కన్నుపడింది

మట్కా మాజీ బుక్కీ మీద కన్నుపడింది

యంకప్ప దగ్గర డబ్బులు ఎక్కువగా ఉందని నిందితులకు తెలిసిపోయింది. మట్కా బుక్కీగా పేరు సంపాధించుకున్న యంకప్ప కొంతకాలం డబ్బులు బాగా సంపాధించాడు. మట్కా బ్యాన్ తో యంకప్ప కొంతకాలం సీక్రేట్ గా బుక్కీగా పని చేశాడు. మట్కా వ్యాపారం దిగజారిపోవడంతో యంకప్ప మరో వ్యాపారం చేస్తున్నాడు.

 సీబీఐ అధికారులు అని పరిచయం

సీబీఐ అధికారులు అని పరిచయం

కలబురిగి జిల్లాలకు చెందిన బసవరాజ్, క్రిష్ణ, జానేష్ అనే ముగ్గురు పోలీసు అధికారులు వేసుకునే ఖాకీ దస్తువులు వేపుకుని యంకప్ప దగ్గరకు వెళ్లారు, మేము సీబీఐ అధికారులు, నిన్ను విచారణ చెయ్యాలని చెప్పారు ఎందుకు అని యంకప్ప ప్రశ్నిస్తే నువ్వు మట్కాకు సంబంధించి అక్రమాలకు పాల్పడుతున్నావని అతన్ని బెదిరించారు.

 నకిలి సీబీఐ అధికారులు అరెస్టు

నకిలి సీబీఐ అధికారులు అరెస్టు

పోలీసు డ్రస్ వేసుకున్న నిందితులు మాజీ మట్కా బుకీ యంకప్ప దగ్గరకు వెళ్లారు. మేము సీబీఐ అధికారులు, నిన్ను విచారణ చెయ్యాలని చెప్పి యంకప్పను కారులో పిలుచుకుని వెళ్లారు. మాజీ మట్కా బాస్ యంకప్పను కారులో కిడ్నాప్ చేసి రహస్య ప్రాంతానికి పిలుచుకుని వెళ్లి నిన్ను జైలుకు పంపిస్తాము అంటూ బ్లాక్ మెయిల్ చేసిన ముగ్గురు అతన్ని రూ.11 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. డబ్బులు ఇవ్వకపోతే జైలుకు పంపిస్తామని నిందితులు అతన్ని బెదిరించారు. చివరికి యంకప్ప తనను వదిలి పెడితే రెండు గంటల్లో లక్షరూపాయలు తీసుకుని వస్తానని చెప్పి అక్కడి నుంచి తప్పించుకుని వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చెయ్యడంతో బసవరాజ్, క్రిష్ణ, జానేష్ అనే ముగ్గురిని అరెస్టు చేశామని, మరో నిందితుడు తప్పించుకున్నాడని పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+