ఫేస్‌బుక్‌తో స్నేహితులు: అంతరిక్ష వ్యాపారం చేస్తున్న ముగ్గురు యువకులు
లక్నో: సోషల్ నెట్ వర్కింగ్ వైబ్‌సైట్‌గా ఫేస్‌బుక్ ఏ ముహూర్తాన ఈ ప్రపంచంలోకి వచ్చింది ఏమో గానీ దాని వల్ల కొంత మంది ప్రాణాలను నిలబడగా, మరికొంత మంది తమ తమ స్నేహితులను కలుసుకునేందుకు ఎంతగానో ఉపయోగపడింది.

ఇప్పుడు వారంతా ఒక ప్రాంతానికి చెందిన వారు కాదు. అయిన ఆలోచనలు కలిశాయి. ఫేస్‌బుక్‌లో వాళ్ల పరిచయం కాస్త ఓ కంపెనీనే స్ధాపించేలా చేశాయి. ఉత్తరప్రదేశ్‌లోని షహరాన్‌పూర్‌కి చెందిన రాఘవ్, హర్యానాకి చెందిన అంకిత్ భటేజా, అదే రాష్ట్రానికి చెందిన సౌరభ్ కౌశల్ కలిసి ఢిల్లీ కేంద్రంగా రెండేళ్ల క్రితం జోవియాన్ అనే కంపెనీని ప్రారంభించారు.
మరో రెండేళ్లలో క్యూబ్ పేరిట శాటిలైట్‌ను ప్రయోగించేందుకు యత్నాలు చేస్తున్న వీరి లక్ష్యాలు కూడా చాలా పెద్దవిగా ఉన్నాయి. చిన్న చిన్న శాటిలైట్ల తయారీ, త్రీడీ ప్రింటింగ్ సాంకేతికత, అంతరిక్షంలోని చెత్తను తొలగించడం, సైన్యం కోసం సహాయపడే రోబోల తయారీ, ప్రత్యామ్నామ రాకెట్ సాంకేతికత తదితర పెద్ద పెద్ద టార్గెట్లతో వీరు పరిశోధనలు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications