వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముండే, మహాజన్ ఫ్యామిలీకి మూడంకే ముప్పు?

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దివంగత నేతలు గోపీనాత్ ముండే, ప్రమోద్ మహాజన్ కుటుంబాలకు మూడో నంబర్ అంకె ఏ మాత్రం అచ్చిరావడం లేదనే అంచనాలు సాగుతున్నాయి. కాకతాళీయమే అయినా ఆ రెండు కుటుంబాల్లో చోటుచేసుకున్న ప్రమోద్ మహాజన్, ఆయన సోదరుడు ప్రవీణ్ మహాజన్, గోపీనాథ్ ముండే మరణాల్లో ఈ అంకె కనిపిస్తోంది. దీంతో ఆ ప్రచారం సాగుతోంది.

గతంలో బిజెపి సీనియర్ నేతగా, కేంద్ర మంత్రిగా అతి కొద్ది కాలంలోనే మంచి గుర్తింపు పొందిన నేత ప్రమోద్ మహాజన్. తన సోదరుడు ప్రవీణ్ మహాజన్ జరిపిన కాల్పుల్లో ఆయన 2006 మే 3వ తేదీన మృతిచెందారు. పాయింట్ 32 లెసైన్డ్ తుపాకీతో ప్రమోద్‌పై ప్రవీణ్ నాలుగుసార్లు కాల్పులు జరుపగా అందులో మూడు తూటాలు ప్రమోద్ శరీరంలోకి దూసుకెళ్లడంతో ఆయన 13 రోజుల పోటు మృత్యువుతో పోరాటం చేసి కన్నుమూశారు.

3 is the danger number to Munde and Mahajan families


సోదరుడిని కాల్చి చంపిన కేసులో జీవితఖైదు అనుభవిస్తూ వచ్చిన ప్రవీణ్ మహాజన్ 2010 మార్చి 3వ తేదీన బ్రెయిన్ హేమరేజ్‌కు చికిత్స పొందుతూ థానే ఆస్పత్రిలో కన్నుమూశారు. ఇపుడు ఢిల్లీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కేంద్ర మంత్రి గోపీనాథ్ ముండే 2014 జూన్ 3వ తేదీ మృత్యువాతపడ్డారు.

అంతేకాకుడా, ప్రమోద్ మహాజన్ మృతి చెందిన నెలకు ఆయన వద్ద వ్యక్తిగత సహాయకుడిగా పని చేసిన వివేక్ మోయిత్రా ఢిల్లీలోని అధికార బంగ్లాలో 2006 జూన్ 3వ తేదీనే అనుమానాస్పద రీతిలో మరణించారు.

English summary
It is said that Gopinath and Pramod Mahajan families faced threat of 3 number.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X