యజమాని దాడులు: సౌదీ బాధితులకు విముక్తి
తిరువనంతపురం: సౌదీ అరేబియాలో యజమాని చేతిలో చిత్రహింసలకు గురై నానా ఇబ్బందులు ఎదుర్కోన్న ముగ్గురు భారతీయులు ఎట్టకేలకు శనివారం కేరళ చేరుకున్నారు. త్రీవేండ్రంలో కుటుంబ సభ్యులను చూడగానే ముగ్గురు బోరున విలపించారు.
శనివారం ఉదయం త్రివేండ్రం చేరుకున్న బాధితులను చూసిన వెంటనే కన్నీటి పర్యంతమయ్యారు. కేరళలోని హరిపాద్ పట్టణానికి చెందిన అభిషేక్(21), బిజు (29), విమల్(30) అనే ముగ్గురు ఎలక్ట్రీషియన్ ఉద్యోగాలు చెయ్యడానికి సౌదీ అరేబియా వెళ్లారు.

అయితే వారికి అక్కడ ఎలక్ట్రీషియన్ ఉద్యోగాలు ఇవ్వకుండా ఇటుకల బట్టీలో పని చెయ్యాలని వేధించారు. వారి యజమాని ఇష్టం వచ్చినట్లు ముగ్గురి మీద పెద్దపెద్ద కర్రలతో దాడులు చేశాడు. యజమాని ముగ్గురి మీద విచక్షణారహితంగా దాడి చేశాడు.
యజమాని తమను వేధిస్తున్నాడని, వెంటనే కాపాడాలంటూ బాధితులు ఆ వీడియో క్లిప్పింగ్ లను వాట్సప్ లో కేరళలోని కుటుంబ సభ్యులకు పంపించారు. విషయం తెలుసుకున్న విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్, కేరళ ముఖ్యమంత్రి ఉమెన్ చాంది చొరవ చూపారు.

ఆ ముగ్గురిని భారత్ తీసుకురావడానికి సౌదీ అరేబియాలోని కేరళ సంఘాలతో సంప్రదించారు. వెంటనే ముగ్గురిని గుర్తించి సౌదీ అరేబియా నుంచి భారత్ తీసుకురావడానికి అన్ని చర్యలు తీసుకున్నారు.
అనుకున్నట్లే శనివారం ఉదయం వారిని త్రివేండ్రం తీసుకువచ్చారు. తమలాగే సౌదీ అరేబియాలో చాల మంది ఇలా వేధింపులకు గురౌతున్నారని, వారిని రక్షించాలని బాధితులు మీడియాకు చెప్పారు. ఇలాంటి కష్టాలు ఎవ్వరికీ రాకూడదని ముగ్గురు విలపించారు.












Click it and Unblock the Notifications