బిన్నీ 48గంటల డెడ్‌లైన్: కేజ్రీకి షాకిచ్చిన మధుబాదురి

తమ డిమాండ్లు నెరవేర్చకుంటే 48 గంటల్లో కేజ్రీవాల్ నేతృత్వంలోని ఎఎపి ప్రభుత్వాన్ని పడగొడతామని బిన్నీ హెచ్చరించారు. తనకు కనీసం ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు ఉందని ఆయన చెప్పారు. షోయబ్ ఇక్బాల్, రాంబిర్‌తో కలిసి బిన్నీ విలేకరులతో మాట్లాడారు. తమకు మరో ఇద్దరు ఎఎపి ఎమ్మెల్యేల మద్దతు ఉందని చెప్పాడు. వారితో కలిసి కూటమిని ఏర్పాటు చేస్తామన్నారు.
మహిళలను మనుషుల్లా చూడరు
మరోవైపు ఎఎపి వ్యవస్థాపక సభ్యురాలు మధుభాదురి ఆదివారం పార్టీని వీడారు. మహిళా నాయకులను కనీసం మనుషులుగానైనా చూడటం లేదని ఆమె తీవ్రస్థాయిలో మండిపడ్డారు ఆత్మగౌరవం ఉన్న మిగిలిన నాయకురాళ్లు కూడా తన లాగే బయటకు రావాలన్నారు.
‘ఎఎపి మహిళను మనుషులుగా చూడటం లేదు. ఈ వైఖరి నాకు నచ్చలేదు. అందుకే పార్టీని వీడుతున్నా' అని భాదురీ మీడియాతో అన్నారు. కాగా పార్టీ విదేశాంగ విధానాన్ని రూపొందించడానికి ఏర్పాటు చేసిన కమిటీలో భాదురీ సభ్యురాలుగా ఉన్నారు. మహిళా నేతలపై ఆప్ పార్టీ అనుసరిస్తున్న వైఖరిపై భాదురీ మండిపడ్డారు.
‘ఎఎపి మానసికంగా ఒక ఖప్ పంచాయతీ. అక్కడ మహిళలకు చోటు లేదు. పార్టీలో ఉన్న అత్మగౌరవమున్న మిగతా మహిళలు కూడా త్వరలోనే పార్టీని వీడుతారు' అని భాదురీ అన్నారు. అయితే భాదురీ ఆరోపణలను ఎఎపి అసత్యాలని పేర్కొంది. ‘ఒక వ్యక్తి లేదా మహిళ అభిప్రాయాలు పార్టీ అభిప్రాయాలని పరిగణించలేము కదా' అని పార్టీ నేత అశుతోష్ వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications