టాక్ టాక్ హ్యాకింగ్: 3గురు విప్రో ఉద్యోగుల అరెస్టు
కోల్‌కతా: ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ నిర్వహిస్తున్న కాల్ సెంటర్ ఉద్యోగులను ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. బ్రిటన్‌కు చెందిన టెలికాం కంపెనీ టాక్ టాక్ సంస్శకు సంబంధించి భద్రతా నిబంధనలను ఉల్లంఘించారనే ఆరోపణపై వారిని అరెస్టు చేశారు.
టాక్ టాక్‌కు చెందిన భద్రతా నిబంధనలను విప్రో ఉద్యోగులు ఉల్లంఘించినట్లు ఆరోపణలు వచ్చాయి. కోల్‌కతాకు చెందిన ఆ ముగ్గురిని అరెస్టు చేసినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. గత అక్టోబర్‌లో టాక్ టాక్ సంస్థకు చెందిన విలువైన సమాచారం హ్యాకింగ్‌కు గురై కస్టమర్ల వివరాలు చోరీకి గురయ్యాయి.

అయితే, హ్యాకింగ్‌కు ఆ ముగ్గురి అరెస్టుకు సంబంధం లేదని టాక్ టాక్ వెల్లడించింది. డిసెంబర్‌లో తాము నిర్వహించిన భద్రతా సమీక్షలో ముగ్గురు విప్రో ఉద్యోగులు నిబంధనలను అతిక్రమించినట్లు గుర్తించామని, దాంతోనే వారిని పోలీసులు అరెస్టు చేశారని టాక్ టాక్ తెలిపింది.
ఈ నేపథ్యంలో విప్రోతో తమ సంబంధాలను సమీక్షించుకోనున్నట్లు కూడా టాక్ టాక్ తెలిపింది. దీనికి సంబంధించిన వార్తా కథనాన్ని బ్రిటిష్ మీడియా బుధవారంనాడు ఇచ్చింది.












Click it and Unblock the Notifications