ఇద్దరు కవలల్ని ఇంట్లోకి పిలిచిన కోడలు, రేప్ చేసిన 50 ఏళ్ల మామ!

ముజఫర్ నగర్: ఉత్తర ప్రదేశ్‌లోని ముజఫర్ నగర్‌లో దారుణం జరిగింది. ఇద్దరు మూడేళ్ల చిన్నారులను ఓ కోడలు పిలవగా, ఆమె మామ అత్యాచారం చేసినట్లుగా తెలుస్తోంది. ఆ మూడేళ్ల పిల్లలు కవలలు. ఇది మీర్పూర్‌లో జరిగింది. చిన్నారులు చెప్పిన సమాచారంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు.

మూడేళ్ల ఆ కవలలు తమ ఇంటి బయట ఆడుకుంటున్నారు. ఆ సమయంలో పక్కంటిలో ఉన్న ఓ కోడలు వారిని తన ఇంటికి పిలిచింది. అయితే, ఆ ఇంట్లో ఉన్న యాభై ఏళ్ల వ్యక్తి (ఆమె మామ) వారి పైన అత్యాచారం చేసినట్లుగా తెలుస్తోంది.

girl, uttar pradesh, rape, meerapur, muzaffarnagar, బాలిక, ఉత్తర ప్రదేశ్, అత్యాచారం, ముజఫర్ నగర్

తర్వాత వారు ఇంటికి తిరిగి వచ్చారు. ఆ పిల్లలు జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పారు. వారు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు చిన్నారులను పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నిందితుడిని అరెస్టు చేశారు.

ఈ సంఘటన సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో జరిగింది. పక్కింట్లో ఉండే కోడలు వారిని ఇంటిలోకి తీసుకు వెళ్లిందని, ఆ సమయంలో అత్యాచారం జరిగినట్లుగా తెలుస్తోందని పోలీసులు చెప్పారు. పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితుడు ఈ ఘాతుకానికి పాల్పడిన సమయంలో తాగి ఉన్నాడు. కాగా, ఇందులో కోడలు పాత్ర ఏమైనా ఉందా అని పోలీసులు ఆరా తీస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+