3ఏళ్ల చిన్నారిపై అత్యాచారం.. డబ్బాలో కుక్కి పారిపోయిన నిందితుడు
రాంపూర్: మూడేళ్ల బాలికపై 18ఏళ్ల యువకుడు అత్యాచారానికి ఒడిగట్టిన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రాంపూర్ పట్టణంలో చోటు చేసుకుంది. ఏప్రిల్ 2వ తేదీన ఈ ఘటన జరిగింది.
బాలిక తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయం చూసి చాక్లెట్లతో ఆమెను ఆకర్షించాడు యువకుడు. అభం శుభం తెలియని ఆ బాలిక చాక్లెట్ల కోసం అతని వెంట వెళ్లింది. బాలికను తన ఇంటికి తీసుకెళ్లిన యువకుడు.. అక్కడ ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు.

నొప్పితో చిన్నారి ఏడవడంతో ఆమెను ఒక డబ్బాలో నిర్బంధించి పారిపోయాడు. అప్పటికీ చిన్నారి ఏడుస్తూనే ఉండటంతో చుట్టుపక్కలవాళ్లు గమనించారు. దీంతో యువకుడి ఇంట్లోకి వెళ్లి చూడగా.. ఒక డబ్బాలో బాలికను బంధించినట్టు గుర్తించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోస్కో చట్టం కింద కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు.












Click it and Unblock the Notifications