వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీ సంచలన నిర్ణయం: ఎంపీల జీతాల్లో కోత, ఏడాదిపాటు, ఎంపీల్యాడ్స్ రెండేళ్లు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో ప్రభుత్వానికి రాబడి తగ్గిపోవడంతో ఎంపీల జీతాల్లో భారీగా కోత విధించింది. ప్రధానితోపాటు కేంద్రమంత్రులు, ఎంపీల జీతాల్లో ఏడాదిపాటు 30శాతం కోతకు సంబంధించిన ఆర్డినెన్స్‌ను ఆమోదించింది.

ప్రధాని నరేంద్ర మోడీతోపాటు ఎంపీలందరి జీతాల్లో ఏప్రిల్ నెల నుంచి ఏడాదిపాటు కోత విధించనున్నట్లు కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ వెల్లడించారు. అంతేగాక, రెండేళ్లపాటు ఎంపీ లాడ్స్ నిధులు కూడా మంజూరు చేయలేమని స్పష్టం చేశారు.

30 per cent salary cut for MPs, MPLAD fund suspended for two years: Modi cabinet decided

ఇక మాజీ ఎంపీల పెన్షన్ లోనూ 30 శాతం కోత పడనుంది. ఈ మేరకు పార్లమెంటు సభ్యుల జీతాలు, పెన్షన్ల చట్టం-1954ను సవరిస్తూ.. సోమవారం కేంద్రం ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆమోద ముద్ర వేసింది.

రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, రాష్ట్రాల గవర్నర్లకు కూడా ఏడాదిపాటు 30 శాతం తక్కువ జీతం తీసుకునేందుకు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. ఆ నిధులన్నీ కన్సాలిడేట్ ఫండ్ ఆఫ్ ఇండియాకు వెళ్తాయని కేంద్రమంత్రి తెలిపారు.

English summary
The Union Cabinet has approved the ordinance amending the salary, allowances and pension of Members of Parliament Act of 1954. This would reduce the allowances and pension from April 1 2020 for one year. PM president, vp and governors have decided to voluntarily take a 30 per cent cut for one year.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X