ఏడాదిన్నర చిన్నారిపై 30 ఏళ్ల వ్యక్తి హత్యాచారం... ఉత్తరప్రదేశ్‌లో వెలుగుచూసిన దారుణం...

ఉత్తరప్రదేశ్‌లో దారుణం వెలుగుచూసింది. ఏడాదిన్నర వయసున్న ఓ బాలిక హత్యాచారానికి గురైంది. 30 ఏళ్ల ఓ వ్యక్తి బాలికపై అత్యాచారానికి పాల్పడటంతో తీవ్ర రక్తస్రావంతో బాధిత చిన్నారి మృతి చెందింది. నిందితుడిని పోలీసులు కస్టడీలోకి తీసుకుని కోర్టుకు తరలిస్తుండగా తప్పించుకునే ప్రయత్నం చేశాడు. దీంతో పోలీసులు అతనిపై కాల్పులు జరపాల్సి వచ్చింది. దీంతో అతని కాలికి గాయమైంది. ఉత్తరప్రదేశ్‌లోని బహ్రాయిచ్ జిల్లాలో ఈ దారుణం చోటు చేసుకుంది.

నిద్రిస్తున్న చిన్నారిని ఎత్తుకెళ్లి...

నిద్రిస్తున్న చిన్నారిని ఎత్తుకెళ్లి...

పోలీసుల కథనం ప్రకారం... బహ్రాయిచ్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన కుటుంబం సోమవారం(జూన్ 21) రాత్రి ఇంటి ఆవరణలో నిద్ర పోయారు. అంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో 30 ఏళ్ల ఓ వ్యక్తి నిద్రిస్తున్న చిన్నారిని ఎత్తుకెళ్లాడు. నిర్మానుష్యంగా ఉన్న స్కూల్ భవనం వద్దకు చిన్నారిని తీసుకెళ్లి ఆమెపై అత్యాచారం చేశాడు. మంగళవారం తెల్లవారుజామున నిద్ర లేచేసరికి చిన్నారి కనిపించకపోవడంతో ఆమె తల్లిదండ్రులు వెతకడం మొదలుపెట్టారు.

రక్తస్రావంతో అచేతనంగా చిన్నారి...

రక్తస్రావంతో అచేతనంగా చిన్నారి...

ఈ క్రమంలో స్థానికంగా ఉన్న స్కూల్ వద్ద ఆ చిన్నారి తీవ్ర రక్తస్రావంతో అచేతనంగా పడి ఉండటం గమనించారు. నిందితుడిని పట్టుకుని స్థానికులతో కలిసి అతన్ని చితకబాదారు. అనంతరం అతన్ని పోలీసులకు అప్పగించారు. చిన్నారిని ఆస్పత్రికి తరలించగా... అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. మరోవైపు నిందితుడిని పోలీసులు కోర్టుకు తరలిస్తుండగా... అతను తప్పించుకునే ప్రయత్నం చేశాడు. పోలీసులపై దాడి చేసి పారిపోయేందుకు యత్నించాడు. దీంతో పోలీసులు అతనిపై కాల్పులు జరపాల్సి వచ్చింది.

Recommended Video

    హైదరబాద్ లో బాలికను రేప్ చేసిన రౌడీ షీటర్
    నిందితుడిపై కాల్పులు

    నిందితుడిపై కాల్పులు

    పోలీసుల కాల్పుల్లో నిందితుడి కాలికి గాయమైంది. నిజానికి పోలీసులు మొదట గాల్లోకి కాల్పులు జరిపారు. అయినప్పటికీ అతను ఆగకపోవడంతో కాలికి బుల్లెట్ దించారు. అనంతరం అతన్ని కోర్టు ఎదుట ప్రవేశపెట్టగా... న్యాయస్థానం ఆదేశాల మేరకు రిమాండుకు తరలించారు. నిందితుడిపై పోక్సో చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లో చిన్నారులు,మహిళలపై అఘాయిత్యాలు నిత్యకృత్యం కావడం ఆందోళన రేకెత్తిస్తోంది. మహిళలపై నేరాల విషయంలో యూపీ పేరు నిత్యం వార్తల్లోకి ఎక్కుతూనే ఉంది. గతేడాది హత్రాస్‌లో దళిత యువతిపై హత్యాచార ఘటన దేశంలో ఎంత సంచలనం రేకెత్తించిందో తెలిసిందే. ఆ తర్వాత ఎన్నో అత్యాచార,హత్యాచార ఘటనలు యూపీలో వెలుగుచూశాయి,వెలుగుచూస్తూనే ఉన్నాయి.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+