వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆకలికి 300 యాక్స్ మృతి...అత్యధిక మంచు కురవడమే కారణం..

|
Google Oneindia TeluguNews

ఒకవైపు దక్షిణాదిరాష్ట్ర్రాల్లో ఎండల తీవ్రత, తెలుగు రాష్ట్ర్ర బానుడు భగభగ మండుతున్నాడు, ఉదయం పది దాటిందంటే బయటకు అడుగుపెట్టలేని పరిస్థితి..ఇక మనుష్యులే ఇలా ఉంటే పశువుల పరిస్థితి చెప్పనలవి కాదు. పశువులకు తాగేందుకు నీళ్లులేక విలవిలలాడుతున్నాయి. ఎండలకు మాడి మసయిపోతున్నాయి. కాని ఈశాన్య రాష్ట్ర్రాల్లో మాత్రం మంచుకురిసి గడ్డిలేక వందలాదీ జడల బర్రేలు మృతి చెందిన సంఘటనలు చోటుచేసుకున్నాయి.

ఈ నేపథ్యంలోనే ఈశాన్య రాష్ట్ర్రమైన హిమాలయాల్లో ఉండే సిక్కింలో గత డిశంబర్ మాసం నుండి శీతాకాలంలో విపరీతం అయిన మంచు కురించింది. గత డిశంబర్ ల నుండి నార్త్ సిక్కింలో మంచు ప్రవాహం వచ్చింది. ఈనేపథ్యంలోనే అక్కడ జీవించే జడల బర్రేలకు ఆహర సమస్య వచ్చిపడింది. ముఖ్యంగా హిమాలయ పర్వత ప్రాంతాల్లో నివసించే జడల బర్రెలకు అక్కడి కొండలపై దొరికే గడ్డి ఆహారంగా తింటాయి..

300 Yaks Die Of Starvation In Sikkim

గత డిశంబర్‌లో విపరీతంగా మంచుకురువడంతో సుమారు 10ఫీట్ల ఎత్తులో మంచు పేరుకుపోయింది. దీంతో అక్కడ జీవీంచే జడల బర్రెలకు ఆహరం దొరకడం కష్టమైంది. ఓ వైపు మంచు మరోవైపు తిండిలేక సుమారు 300 జడల బర్రెలు చనిపోయినట్టు అక్కడి అధికారులు తెలుపుతున్నారు. మొత్తం మంచుపేరుకుపోవడంతో వాటికి గడ్డి లభించక అవి మృతి చెందుతున్నాయి..ఇలా చనిపోయిన జడల బర్రెలు ప్రస్థుతం ఎండాకాలం కావడంతో మంచు కరుగుతున్న సమయంలో. చనిపోయిన యాక్స్ కళేభారాలు ఒక్కోక్కటి బయట పడుతున్నాయి.

అయితే మంచుకురుస్తున్న సమయంలో అక్కడి వైల్డ్ ఎనిమల్ అధికారులు వాటికి కావాల్సిన గడ్డి ,మొక్క జోన్న కూడ సప్లై చేసినట్టు చెబుతున్నారు.కాని అవి వాటికి సరిగా అందిన పరిస్థితి మాత్రం కనిపించలేదు.దీంతో పాటు వాటిమీద ఆధారపడిన కుటుంభాలు కూడ ఆర్ధికంగా ఇబ్బందుల పాలైనట్టు చెబుతున్నారు. కాగా ఆయా కుటుంభాలకు సరైన నష్టపరిహరం కూడ ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు.

కాగా విపరీమైన స్నోఫాల్ తో గడ్డి పెరగకపోవడంతో అవన్ని మ‌ృతి చెందినట్టు అధికారులు చెబుతున్నారు. కాగా ఇలాంటీ స్నోఫాల్ 1995 సంవత్సరంలో కురిసినట్టు అధికారులు చెబుతున్నారు.కాగా చనిపోయిన యాక్స్ సంబంధించి ఇంకా ఎమైనా ఉన్నాయా అనేది వెతుకుతున్నారు.ఇక బతికిఉన్నవాటి కోసం కూడ సరైన గడ్డిని అందించేందుకు అధికారరులు ఏర్పాటు చేస్తున్నారు.

English summary
After a bout of harsh winter weather, around 300 Himalayan yaks have died in Sikkim, said officials.According to government sources, the yaks died in the cold desert region of North Sikkim allegedly due to starvation
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X