ఎక్స్ ప్రెస్ రైలులో మహిళను రేప్ చేసిన ఉద్యోగి, అరిస్తే బయటకు తోసేస్తా, ఆ గదిలో !

Posted By:
Subscribe to Oneindia Telugu

జైపూర్/సూరత్: ఎక్స్ ప్రెస్ రైలులో సీటు ఇప్పిస్తానని మహిళ మీద అత్యాచారం చేసిన దారుణం ఘటన బాంద్రా-జైపూర్ అరవాళి ఎక్స్ ప్రెస్ రైలులో జరిగింది. 32 ఏళ్ల మహిళ మీద అత్యాచారం చేసిన కామాంధుడిని జైపూర్ రైల్వే పోలీసులు అరెస్టు చేశారు.

యువతితో రోమాన్స్: నగ్నంగా బయటకు లాక్కొచ్చిన అమ్మాయి ఫ్యామిలీ, ఏం చేశారంటే!

వేగంగా వెలుతున్న ఎక్స్ ప్రెస్ రైలులోనే మహిళ మీద అత్యాచారం చేసిన రైల్వే ఉద్యోగి అజహర్ ఖాన్ అనే కామాంధుడిని బెండ్ తీస్తున్నారు. విషయం బయటకు చెబితే నీ ప్రాణాలు తీస్తానని, రైలులో నుంచి కిందకు తోసేస్తానని బాధితురాలిని నిందితుడు బెదిరించాడని రైల్వే పోలీసుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది.

స్నేహితురాలితో కలిసి !

స్నేహితురాలితో కలిసి !

ఘాజియాబాద్ కు చెందిన 32 వివాహిత మహిళ స్నేహితురాలితో కలిసి బాంద్రా-జైపూర్ అరవాళి ఎక్స్ ప్రెస్ రైలులో జైపూర్ చేరుకోవడానికి బయలుదేరింది. తరువాత ఓ ప్రైవేట్ ట్యాక్సీలో ఆమె రైల్వే స్టేషన్ చేరుకునింది.

ఒక్క సీటు కావాలి!

ఒక్క సీటు కావాలి!

32 ఏళ్ల మహిళ, ఆమె స్నేహితురాలు రైలులో ప్రయాణించడానికి సిద్దం అయ్యారు. అయితే ఒక్క సీటు మాత్రమే వారికి చిక్కింది. మరో సీటు కావాలని చూస్తున్నారు. అయితే రైలులో రద్దీ విపరీతంగా ఉండటంతో వారు చాల ఇబ్బంది పడ్డారు.

రైలులో హంగామా !

రైలులో హంగామా !

బాందా-జైపూర్ అరివాళి ఎక్స్ ప్రెస్ రైలులో నిలబడి వెలుతున్న సమయంలో అటు వైపు క్యాటరింగ్ చేసే ఉద్యోగి అజహర్ ఖాన్ అనే వ్యక్తి అటు వైపు వచ్చాడు. ఆ సందర్బంలో ఆమె సర్ ఒక్క సీటు సర్దిపెట్టండి. చాల ఇబ్బంది పడుతున్నాం అంటూ ఆ మహిళ అతనికి మనవి చేసింది.

టీసీతో మాట్లాడాతుతా !

టీసీతో మాట్లాడాతుతా !

ఓస్ అంతేనా, ఇక ఈ విషయం నాకు వదిలేయండి అంటూ అజహర్ ఖాన్ ఆమెకు చెప్పాడు. ఆ సమయంలో అజహర్ ఖాన్ అటూ ఇటూ తిరుగుతూ నానా హంగామా చేశాడు. అతని హంగామా చూస్తూంటే నిజంగా తనకు సీటు చిక్కేటట్లు ఉందని ఆమె భ్రమపడిపోయింది.

కదులుతున్న రైలులోనే !

కదులుతున్న రైలులోనే !

రైలు వేగంగా వెలుతుతన్న సమయంలో అజహర్ ఖాన్ 32 ఏళ్ల మహిళకు ఫోన్ చేశాడు. సీటు చిక్కింది రావాలని చెప్పాడు. అతని దగ్గరకు వెళ్లిన తరువాత కామాంధుడు ఆమెను క్యాటరింగ్ సామాగ్రి ఉండే చిన్నగదిలోకి లాక్కెళ్లాడు. తరువాత ఆమె మీద అత్యాచారం చేశాడు. కేకలు వేసినా విషయం బయటకు చెప్పినా రైలులో నుంచి కిందకు తోసేస్తానని నీ ప్రాణాలు పోతాయని ఆమెను హెచ్చరించాడు.

రైల్వే పోలీసులు !

రైల్వే పోలీసులు !

మహిళ మీద అత్యాచారం చేసిన కామాంధుడు చిన్నగా జారుకున్నాడు. కదులుతున్న రైలులో అతని మీ ఫిర్యాదు చేస్తే ప్రాణాలకు ముప్పు అంటూ ఆమె భయపడింది. రైలు జైపూర్ రైల్వే స్టేషన్ చేరుకోగానే బాధితురాలు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలు ఇచ్చిన సమాచారం మేరకు రైల్వే పోలీసులు అజహర్ ఖాన్ ను అరెస్టు చేశారు.

కేసు సూరత్ కు !

కేసు సూరత్ కు !

మహిళ మీద అత్యాచారం జరిగిన సమయంలో రైలు సూరత్-భారుచ మార్గం మద్యలో ఉందని అధికారులు గుర్తించారు. కేసు నమోదు చేసిన జైపూర్ పోలీసులు కేసును సూరత్ రైల్వే పోలీసులకు బదిలి చేశారు. కామాంధుడు అజహర్ ఖాన్ ఇంకా ఎంత మంది రైలు ప్రయాణికులను ఇలా అత్యాచారం చేశాడు అంటూ రైల్వే పోలీసులు విచారణ చేస్తున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Western Railways on Tuesday confirmed that one person has been arrested for raping a 32-year-old girl on the Bandra-Jaipur Aravali Express, In a statement, Western Railway said, "The accused, Ajhar Khan, who raped the victim in the running train between Surat and Bharuch.
Please Wait while comments are loading...