వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విషాదం: చార్ ధామ్ యాత్రలో ఇప్పటి వరకు 39 మంది మృతి, అలాంటివారు రాకూడదని సూచన

|
Google Oneindia TeluguNews

డెహ్రాడూన్: చార్ ధామ్ యాత్ర మార్గంలో ఇప్పటివరకు కనీసం 39 మంది యాత్రికులు మరణించారని ఉత్తరాఖండ్ డైరెక్టర్ జనరల్ హెల్త్ డాక్టర్ శైలజా భట్ సోమవారం తెలిపారు.
మరణానికి కారణం అధిక రక్తపోటు, గుండె సంబంధిత సమస్యలు, పర్వత అనారోగ్యం అని ఆమె తెలిపారు.

వైద్యపరంగా పూర్తి ఆరోగ్యంగా లేనివారు, శారీరక ఇతర అనారోగ్యంతో బాధపడేవారు విశ్రాంతి తీసుకోవాలని లేదా ప్రయాణం చేయవద్దని సూచించారు.

ఉత్తరాఖండ్‌లోని నాలుగు ప్రసిద్ధ హిమాలయ పుణ్యక్షేత్రాలకు చార్ ధామ్ యాత్ర మే 3న గంగోత్రి, యమునోత్రి ఆలయాలను తెరవడంతో ప్రారంభమైంది. ప్రసిద్ధ శివాలయం, కేదార్‌నాథ్ మే 6న తెరవబడింది. బద్రీనాథ్ తలుపులు మే 8న ప్రజల కోసం తెరవబడ్డాయి.

39 pilgrims have died on Char Dham Yatra route so far; medically unfit people advised not to come

ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి సూచనల మేరకు రాష్ట్ర ఆరోగ్య శాఖ చార్ ధామ్ యాత్ర ప్రవేశ, నమోదు ప్రదేశంలో ఆరోగ్య పరీక్ష సౌకర్యాన్ని ప్రారంభించింది. అయితే, పూర్తి ఆరోగ్యంగా ఉన్నవారు మాత్రమే చార్ ధామ్ యాత్రకు రావాలని అధికారులు కోరుతున్నారు.

'యమునోత్రి, గంగోత్రి యాత్ర మార్గంలో దోబాటా, హీనా, బద్రీనాథ్ ధామ్ యాత్రికుల కోసం పాండుకేశ్వర్ వద్ద ఆరోగ్య పరీక్షా శిబిరం ఏర్పాటు చేయబడింది' అని శైలజా భట్ తెలిపారు.

అత్యవసర పరిస్థితుల్లో అనారోగ్యానికి గురైన యాత్రికులను వాయు మార్గం గుండా తరలించేందుకు హెలి అంబులెన్స్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంచామని వెల్లడించారు.

యాత్ర ప్రారంభమైన నాటి నుంచి మూడు లక్షలమందికిపైగా భక్తులు చార్ ధామ్ దర్శనం చేసుకున్నారని తెలిపారు. కేదరనాథ్ సందర్శనకు ప్రతి రోజు 12,000 మంది, బద్రినాథ్ దర్శనంకు 15,000 మంది, గంగోత్రి దర్శనంకు 7వేల మంది, యమునోత్రి సందర్శనంకు 4,000 మంది యాత్రికులను మాత్రమే అనుమతిస్తున్నారు.

English summary
39 pilgrims have died on Char Dham Yatra route so far; medically unfit people advised not to travel.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X