కరోనా థర్డ్ వేవా..? మహారాష్ట్రలో త్వరలోనే.. మంత్రి ఆదిత్య థాకరే హాట్ కామెంట్స్

కరోనా సెకండ్ వేవ్ గురించి తలచుకుంటే ఒళ్లు గగుర్పొడుస్తోంది. వైరస్ అంటేనే గజ గజ వణికే పరిస్థితి ఉంది. థర్డ్ వేవ్ మాటే లేదు. సెకండ వేవ్‌లో లక్షణాలు తెలియడం లేదు. చాలా మంది చనిపోవడంతో భయాందోళన నెలకొంది. కానీ మహారాష్ట్ర మంత్రి, శివసేన నేత ఆదిత్య థాకరే మాత్రం కరోనా థర్డ్ వేవ్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

మహారాష్ట్రలో త్వరలో కరోనా మూడోవేవ్ ప్రారంభమయ్యే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయని ఆదిత్య థాకరే సంచలన ప్రకటన చేశారు. రెండో వేవ్ కంటే బలంగా ఉంటుందా? బలహీనంగా ఉంటుందా? అని మాత్రం ఇప్పుడే నిర్ధారించలేమని స్పష్టం చేశారు. కోవిడ్ టీకా ఇప్పటికిప్పుడే పని చేకపోయినా, భవిష్యత్తులో ఇది ఎంతో ఉపయోగంలోకి వస్తుందని కామెంట్ చేశారు. కరోనా వైరస్ దృష్ట్యా రాష్ట్రంలో తీసుకునే ప్రతి నిర్ణయం కోవిడ్ టాస్క్‌ఫోర్స్ సూచించిన ప్రకారమే తీసుకుంటున్నామని, ఇందులో రాజకీయం ఏమాత్రం లేదని స్పష్టం చేశారు.

3rd Wave of Covid-19 Likely in Maharashtra Soon: Aaditya Thackeray

కరోనా కేసుల విషయంలో కొందరు లెక్కలు సరిగ్గా చెప్పడం లేదని, తాము మాత్రం మూడో వేవ్‌ను ఎదుర్కోడానికి సన్నద్ధమవుతున్నామని పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 5 లక్షల పడకలు సిద్ధంగా ఉన్నాయని వివరించారు. అందులో 70 శాతం ఆక్సిజన్‌తో కూడినవే అని స్పష్టంచేశారు. గతంతో పోలిస్తే రోజువారీ కూలీల పరిస్థితి కాస్త మెరుగ్గానే ఉందని వివరించారు. ఆ విషయంలో తాము కాస్త అనుభవం కూడా సాధించామని ఆదిత్య థాకరే అన్నారు. పరిస్థితి అంతా సర్దుకుంటుందనే ఆశాభావం వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+