భారత్ లో 4,58,727 క్రియాశీల కేసులు.. తగ్గిన కొత్త కేసులు, పెరిగిన మరణాలు

భారతదేశంలో కరోనా మహమ్మారి కేసుల మధ్య ఊగిసలాట కొనసాగుతుంది. గడచిన 24 గంటల్లో కొత్తగా 43,393 కేసులు నమోదు కాగా 911 మరణాలు నమోదయ్యాయి. ప్రస్తుతం భారతదేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,07,52,950 కు చేరుకుంది. ఇక దేశవ్యాప్తంగా సంభవించిన మొత్తం మరణాలు 405,939 కు చేరుకున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

గత 24 గంటల్లో 44,459 మంది కరోనా మహమ్మారి నుండి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం రికవరీలు 2,98,88,284 కు చేరుకున్నాయి. క్రియాశీల కేసులు కూడా గణనీయంగా తగ్గాయి. ప్రస్తుతం దేశంలో క్రియాశీల కేసుల సంఖ్య 4,58,727 గా ఉంది . ఇది మొత్తం కేసులలో 1.50 శాతం ఉన్నాయి. నిన్న భారత దేశంలో కరోనా కేసులు 45,892 నమోదు కాగా తాజాగా గురువారం కేసుల కంటే శుక్రవారం కేసుల సంఖ్య 2,499 తక్కువగా నమోదయింది. శుక్రవారం కరోనా కారణంగా సంభవించిన మరణాలు గురువారం కంటే 94 ఎక్కువగా నమోదయ్యాయి.

4,58,727 active cases in India .. decreased new cases, increased deaths

నిన్న మొత్తం 817 కరోనాతో మృతి చెందగా, బుధవారం దేశంలో 930 మంది మరణించారు. ఇక గడచిన 24 గంటల్లో 911 మంది మృతి చెందారు. ఇప్పటివరకు కోవిడ్ -19 వ్యాధికి సంబంధించి మొత్తం 42,70,16,605 నమూనాలను పరీక్షించగా, గత 24 గంటల్లో 17,90,708 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) శుక్రవారం తెలిపింది. కోవిడ్ -19 కు వ్యతిరేకంగా మొత్తం 36,48,47,549 మోతాదులను ప్రజలకు అందించారు, అందులో 29,58,89,870 మంది మొదటి మోతాదును, 6,89,57,679 మంది రెండు మోతాదులను తీసుకున్నారు. గత 24 గంటల్లో 3.38 మిలియన్ల మంది లబ్ధిదారులకు టీకాలు ఇచ్చారు.

ప్రధాని నరేంద్ర మోడీ గురువారం తన మంత్రుల మండలికి మాట్లాడుతూ ఆత్మసంతృప్తికి అవకాశం లేదని, ఒక్క తప్పు కూడా చాలా వరకు ప్రభావం చూపుతుందని, కోవిడ్ -19 మహమ్మారికి వ్యతిరేకంగా దేశం చేస్తున్న పోరాటాన్ని బలహీనపరుస్తుందని నొక్కి చెప్పారు. అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని తేల్చి చెప్పారు. మాస్కులు ధరించడం లేదా సామాజిక దూరం వంటి కోవిడ్ -19 ప్రోటోకాల్స్‌కు కట్టుబడి ఉండకుండా దేశవ్యాప్తంగా మార్కెట్ ప్రదేశాలలో తీవ్రమైన రద్దీ ఉన్నట్లు ఫోటోలు మరియు వీడియోలు వెలువడినందున, ఇది ఆహ్లాదకరమైన దృశ్యం కాదని, ఇది ప్రజలలో భయాన్ని కలిగించాలని మోడీ అన్నారు.

Recommended Video

    Ms Dhoni అంటే Gambhir కి అందుకే పడదు.. గంభీర్ ఆవేదనలో అర్థం ఉందా !

    కోవిడ్ -19 కేసుల సంఖ్య ఇటీవలి నెలల్లో తక్కువగా నమోదు కావటంతో, ప్రజలు బయటకు వెళ్లొచ్చని పిఎం మోడీ అన్నారు. అయినప్పటికీ, కోవిడ్ -19 ముప్పు పొంచి ఉంది అనే విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలన్నారు.అనేక ఇతర దేశాలు అంటువ్యాధుల పెరుగుదలను చూస్తున్నాయని, వైరస్ కూడా పరివర్తన చెందుతోందని అప్రమత్తత అవసరమన్నారు. భవిష్యత్తులో దేశం మహమ్మారి నుండి కాపాడుకోవడానికి వీలుగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలను కోరాలని ప్రధాని మంత్రులకు చెప్పారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+