కాంగ్రెస్‌లో కలవరం: అందుబాటులో లేని నలుగురు ఎమ్మెల్యేలు
బెంగళూరు: కర్ణాటకలో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో ప్రభుత్వ ఏర్పాటు విషయంపై ఓ భారతీయ జనతా పార్టీ, మరో వైపు కాంగ్రెస్, జేడీఎస్‌లు ముమ్మర కసరత్తులు చేస్తున్నాయి. ఈ నేపథ్యంతో తమ పార్టీ ఎమ్మెల్యేలు బీజేపీ వైపు మొగ్గు చూపుతారనే ఉద్దేశంతో వారిని ఇప్పటికే రిసార్టులకు పంపే పనులు ప్రారంభించారు.
అయితే, తాజాగా అందిన సమాచారం ప్రకారం.. కాంగ్రెస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు ఆ పార్టీ నేతలకు అందుబాటులో లేరని తెలుస్తోంది. ఈ క్రమంలో వీరంతా బీజేపీకి మద్దతిచ్చేందుకు వెళ్లారా? అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి.

కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ప్రయత్నాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ పరిణామం ఇరుపార్టీల నేతలనూ ఆందోళనకు గురిచేస్తోంది. 104స్థానాలు దక్కించుకున్న బీజేపీకి అధికారం చేపట్టాలంటే కేలవం 8మంది ఎమ్మెల్యేల అవసరం ఉంది.
కాంగ్రెస్ పార్టీకి అందుబాటులో లేని కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో ఆనంద్ సింగ్, రాజశేఖర్ పాటిల్, నాగేంద్ర, ఎంవై పాటిల్‌లు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పార్టీ ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ పార్టీ లెజిస్లేచర్ పార్టీ మీటింగ్ తలపెట్టింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా హాజరుకావాలని కోరింది. ఇది ఇలా ఉండగా, ఇప్పటికే తమకు 12మంది బీజేపీ ఎమ్మెల్యేల మద్దతు ఉందని బీజేపీ సీఎం అభ్యర్థి యడ్యూరప్ప చెప్పడం గమనార్హం.












Click it and Unblock the Notifications