వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీ క్యాబినెట్‌లో వైద్యులకు ప్రయారిటీ, నలుగురు డాక్టర్లు.. విభిన్న నేపథ్యం..

|
Google Oneindia TeluguNews

మోడీ 2.0 క్యాబినెట్ కొలువుదీరింది. 43 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. క్యాబినెట్‌లో జ్యోతిరాదిత్య సిందియా++, పశుపతి కుమార్ పరాస్, అనురాగ్ ఠాకూర్‌కు చోటు దక్కింది. మెజార్టీ మంత్రులు ఎస్సీ, ఎస్టీలకే కేటాయించడం విశేషం. ఇక 27 మంది ఓబీసీలు, 13 మంది లాయర్లు, ఆరుగురు డాక్టర్లు, ఐదుగురు ఇంజినీర్లు, ఏడుగురు సివిల్ సర్వెంట్లు ఉన్నారు. నలుగురు వైద్యుల గురించి తెలుసుకుందాం. పదండి.

డాక్టర్ సుభాష్ సర్కార్

డాక్టర్ సుభాష్ సర్కార్

డాక్టర్ సుభాష్ సర్కార్.. పశ్చిమ బెంగాల్ బంకూర లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందారు. టీఎంసీ అభ్యర్థి సుబ్రతా ముఖర్జీని లక్ష 74 వేల 333 ఓట్ల తేడాతో ఓడించారు. బంకూర క్రిస్టియన్ కాలేజీ నుంచి సుభాష్ సర్కార్ మెడసిన్ చేశారు. తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. 2013-15 మధ్య బెంగాల్ బీజేపీ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. 2015-17 వరకు బెంగాల్ బీజేపీ జనరల్ సెక్రటరీగా పనిచేశారు. గత 28 ఏళ్ల నుంచి గైనకాలజీ విభాగంలో మెడకల్ ప్రాక్టిషనర్ పనిచేశారు. 33 వేల డెలివరీలు చేశారు.

డాక్టర్ భారతీ ప్రవీణ్ పవార్


నాసిక్ నుంచి డాక్టర్ భారతీ ప్రవీణ్ పవార్ పోటీ చేసి గెలుపొందారు. సమాజ్ మెడికల్ కాలేజీ నుంచి ఎంబీబీఎస్ చేశారు. తర్వాత ఎన్సీపీలో చేరారు. కానీ అక్కడ తగిన ప్రాధాన్యం లేకపోవడంతో బీజేపీలోకి వచ్చారు. మహిళ వైద్యురాలు అయిన భారతీ.. ఎస్టీ కూడా. అందుకే రైతుల సమస్యలను పార్లమెంట్‌లో ప్రస్తావించారు. నాసిక్‌లో జనం వాటర్ ఎక్కువగా తీసుకోవాలని.. పోషకాహారం అధికంగా తీసుకోవాలని ఉద్యమమే చేశారు.

డాక్టర్ భాగవత్ కిసాన్ రావు కారద్

డాక్టర్ భాగవత్ కిసాన్ రావు కారద్

ఔరంగబాద్ నుంచి డాక్టర్ భాగవత్ కిసాన్ రావు కారద్ పోటీ చేసి గెలుపొందారు. ఔరంగబాద్‌లో కారద్ ఆస్పత్రి నిర్వహిస్తున్నారు. గోపినాథ్ ముండే మరణం తర్వాత.. ఆదివాసీ నేత భాగవత్ ఎదిగారు. వంజరీ కులానికి చెందినవారు భాగవత్. ముండే కూతురు ప్రీతమ్ ఉన్న.. మంచి ప్రజధారణ పొందారు భాగవత్. ఇదివరకు ఔరంగబాద్ మేయర్‌గా కూడా పనిచేశారు.

డాక్టర్ మహేంద్ర కలుభాయ్

డాక్టర్ మహేంద్ర కలుభాయ్ ముంజపర గుజరాత్‌లో గల సురేంద్రనగర్ లోక్ సభ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అహ్మదాబాద్‌లో గల ఎన్‌హెచ్ఎల్ మెడికల్ కాలేజీ నుంచి ఎంబీబీఎస్ చేశారు. కోలి కులానికి చెందిన మహేంద్ర.. స్టేట్ లెవల్ స్విమ్మింగ్ ఛాంపియన్ కూడా. రైతు కూలీ నుంచి.. కష్టపడి చదివి డాక్టర్ అయ్యారు. స్నేహితులు, బంధువుల సాయం తీసుకొని మెడిసిన్ చేశారు. పేద ప్రజల కోసం రెగ్యులర్‌గా హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేస్తారు.

Recommended Video

Hyderabad MMTS Trains Services Resumes From Today After 15 Months | SCR | Oneindia Telugu

English summary
PM Modi's Cabinet expansion has 13 lawyers, six doctors, five engineers, and seven civil servants in total. here 4 doctors information.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X