బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు: ఆరుగురు మృతి

 4 Killed, 10 Injured While Making Crackers in Lucknow
లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నోలోని ఓ బాణాసంచా ఫ్యాక్టరీలో శనివారం భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో ఆరుగు మృతి చెందారు. మరో 14మంది తీవ్రగాయాల పాలయ్యారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని కింగ్ జార్స్ మెడికల్ యూనివర్సిటీ ఆస్పత్రికి తరలించారు.

లక్నోలోని మహన్‌లాల్ గంజ్ ఏరియాలో ఈ ఘటన చోటు చేసుకుంది. కాగా, ఈ బాణాసంచా ఫ్యాక్టరీకి ఎలాంటి అనుమతులు లేనట్లుగా సమాచారం. అక్రమంగా మందుగుండు సామాగ్రి తయారుచేస్తున్నట్లు తెలిసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఆటో బోల్తా ముగ్గురి మృతి

నల్గొండ: జిల్లాలోని గుర్రంపోడు మండలం పాల్వాయి వద్ద శుక్రవారం అర్ధరాత్రి ప్రయాణికులతో వెళ్తున్న ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. కల్వర్టు నిర్మాణం కోసం తీసిన గోతిలో పడిపోవడంతో ఆటో బోల్తా కొట్టింది. క్షతగాత్రులను దేవరకొండ ఆస్పత్రికి తరలించారు.

నిజామాబాద్ జిల్లా సదాశివనగర్ మండలం కల్వరాల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 10మంది తీవ్రగాయాలపాలయ్యారు. ఆగివున్న లారీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+