వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ 48 గంటల్లో 4 టన్నుల బంగారాన్ని విక్రయించారు, నోటీసులిచ్చిన డిజిసిఈఐ

పెద్ద నగదు నోట్ల రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన తర్వాత 48 గంటల్లో నాలుగు టన్నుల బంగారం అమ్మకాలు జరిగాయి. నల్ల ధనం ఉన్న వారి మార్పిడి చేసుకోనేందుకు బంగారాన్ని కొనుగోలు చేశారని ఈడీ అధికారులు అభిప్రాయపడ

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ:పెద్ద నగదు నోట్లను రద్దు చేసిన 48 గంటల్లో 4 టన్నుల బంగారం విక్రయాలు జరిగాయి. ఎంత బంగారం అమ్మకాలు జరిగాయనే దానిపై డైరెక్టరేట్ జనరల్ ఆప్ సెంట్రల్ ఎక్స్చేంచ్ ఇంటలిజెన్స్ జరిపిన సర్వేలో ఆశ్చర్యకరమైన విషయాలు వెల్లడయ్యాయి.

పెద్ద నగదు నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రధానమంత్రి ప్రకటించగానే బంగారం దుకాణాల్లో పెద్ద ఎత్తున విక్రయాలు జరిగాయని ఆ సర్వేలో తేటతెల్లమైంది. 48 గంటల్లో బంగారం వ్యాపారులు 4 టన్నులకు పైగా బంగారాన్ని విక్రయించారని తెలిపింది.

4 tonnes of gold sold in 48 hours after demonatesation

4 టన్నుల బంగారం విలువ సుమారు 1,250 కోట్లకు పైగా ఉంటుంది.పెద్ద నగదు నోట్లను రద్దుచేస్తున్నట్టు ప్రకటించిన రోజునే సుమారు రెండుటన్నుల బంగారం విక్రయాలు సాగాయి.

రద్దైన నోట్లను బంగారంలోకి మార్చుకోవడానికి పెద్ద ఎత్తున అనుమానిత మనీ లాండరింగ్ కార్యకలాపాలు చేశారని ఈ సర్వేలో తేటతెల్లమైంది.డిల్లీకి చెందిన ఓ ప్రముఖ జ్యూయలరీ దుకాణంలో 45 కిలోల బంగారాన్ని ఏడువందల మందికి విక్రయించినట్టు ఈ సర్వే తేల్చింది.ఈ ప్రకటన కంటే ముందు ఈ దుకాణంలో కేవలం 820 గ్రాముల బంగారాన్ని మాత్రమే విక్రయించాడు.

చెన్నైలోని ఓ జ్యుయలర్స్ లో 200 కిలోల బంగారం విక్రయించారు. జైపూర్ లోని ఓ జ్యూయలర్ షాపులో 30 కిలోల బంగారాన్ని విక్రయించారు. మనీ లాండరింగ్ కార్యకలాపాలు విపరీంతంగా జరుగుతున్నాయని గుర్తించిన డిజిసిఈఐ ఈ సర్వేలో తేటతెల్లం చేసింది.

మనీల్యాండరింగ్ కు పాల్పడిన 300 జ్యూయలర్ దుకాణలకు నోటీసులను పంపింది డిజిసిఈఐ. పన్ను ఎగవేత, మనీ లాండరంగ్ కార్యకలాపాలకు పాల్పడ్డారని ఆ జ్యూయలర్ దుకాణాలకు నోటీసులను పంపించింది.

English summary
4 tonnes of gold sold in 48 hours after demonatesation announcement. two tonees of gold sold on november 8, probably the highest retail sale on any given day.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X