Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అయ్యో.. అనిల్, క్షేమంగా బయటికొస్తాడా -90 అడుగుల బోరు బావిలో 4ఏళ్ల బాలుడు -గంటలుగా పోరాటం

అంతులేని నిర్లక్ష్యం మరోసారి వెలుగులోకి వచ్చింది. అవును, రక్షణ లేని బోరు బావిలో మరో చిన్నారి పడిపోయాడు. అసలే కరోనా దెబ్బకు అల్లాడుతూ, ఆక్సిజన్ దొరక్కా విలవిల్లాడుతోన్న దేశంలో ఆ పసి ప్రాణం కోసం కొద్ది గంటలుగా పోరాటం కొనసాగుతోంది. అతను క్షేమంగా బయటికి రావాలని ప్రార్థనలు, ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి..

నాలుగేళ్ల బాలుడు ఇంటి దగ్గరే ఆడుకుంటూ ప్రమాదవశాత్తూ బోరు బావిలో పడిపోయిన ఘటన రాజ‌స్థాన్‌లోని జాలోర్ జిల్లాలో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. అతణ్ని వెలికి తీసేందుకు రెస్క్యూ సిబ్బంది, జిల్లా యంత్రాంగం తీవ్రంగా శ్రమిస్తున్నది. కరోనా ఉధృతిలోనూ అన్ని జాగ్రత్తలతో బాలుడి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నది.

4-Year-Old Falls Into Borewell In Rajasthan, Rescue Operations Underway

జాలోర్ జిల్లాలోని ల‌చ్‌హ్రీ అనే గ్రామానికి చెందిన నాగారామ్ దేవాసీ అనే రైతు త‌న ఇంటిపక్కనుండే పొలంలో రెండు రోజుల కిందట బోరు వేయించాడు. కానీ రక్షణ వ్యవస్థ ఏదీ ఏర్పాటు చేయకుండా వదిలేశాడు. రైతు నాగారామ్ కొడుకైన నాలుగేళ్ల అనిల్ దేవాసీ ఇంటి దగ్గరే ఆడుకుంటూ బోరుబావి దగ్గ‌ర‌కు వెళ్లాడు. దానిపై కప్పి ఉంచిన బస్తాలను తొలగించి, లోపలికి తొంగిచూసే క్రమంలో ప్ర‌మాద‌వ‌శాత్తు జారి ప‌డిపోయాడు..

అనిల్ బోరు బవిలో పడిపోవడాన్ని గమనించిన ఓ వ్యక్తి చుట్టుప‌క్క‌ల‌వారికి విష‌యం చెప్పాడు. ఆ తర్వాత పోలీసుల‌కు స‌మాచారం అందించారు. గంటల వ్యవధిలోనే జిల్లా యంత్రాంగం మొత్తం ల‌చ్‌హ్రీ గ్రామానికి చేరుకుని సహాయ కార్యక్రమాలు మొదలుపెట్టింది. అనిల్ పడిపోయిన బావి 90 మీటర్ల లోతు ఉంద‌ని, బాలుడు మొత్తం కిందికి జారిపోయాడ‌ని సంచోర్ స్టేష‌న్ హౌస్ ఆఫీస‌ర్ ప్ర‌వీణ్‌ కుమార్ ఆచార్య మీడియాకు తెలిపారు.

4-Year-Old Falls Into Borewell In Rajasthan, Rescue Operations Underway

బాలుణ్ని ర‌క్షించేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టామని, అయితే నిపుణుల అందుబాటులో లేక‌పోవ‌డం కొంత ఆల‌స్యం జరిగిందని, వైర్ కెమెరాలను పంపి బాలుడి కదలికలను గుర్తించామని, ప్రత్యేక పైపుల ద్వారా బావిలోనికి ఆక్సిజ‌న్‌ను అందిస్తున్నామ‌ని, ఆహార ప‌దార్థాలు కూడా అందులోకి పంపించామ‌ని అధికారులు చెప్పారు.

బోరు బావికి సమాంతరంగా బయటి నుంచి జేసీబీల ద్వారా తవ్వకాలు కొనసాగుతున్నాయి. అనిల్ క్షేమంగా ప్రాణాలతో బయటపడాలని అందరూ ప్రార్థిస్తున్నారు. బోరు బావుల వద్ద రక్షణ చర్యలకు సంబంధించి చట్టాలు ఉన్నప్పటికీ, అంతులేని నిర్లక్ష్యం కారణంగా ఏటా పదుల సంఖ్యలో పిల్లలు ప్రాణాలు కోల్పోతుండటం దేశంలో పరిపాటిగా మారింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+