అద్భుతం: నాల్గవ అంతస్తు నుంచి కిందపడిన బాలికకు ఏమీ కాలేదు...!

గాంధీ నగర్: సంక్రాంతి వస్తుందంటే చాలా మంది పిల్లలు గాలిపటాలు ఎగరవేసే అలవాటు ఉంటుంది. ఇలానే గాలిపటం ఎగరేసేందుకు గుజరాత్‌ పట్టణంలో నాలుగేళ్ల మహి దేశాయ్ అనే బాలిక నాల్గవ అంతస్తు పైకి వెళ్లి ప్రమాదవశాత్తు కిందపడిపోయింది. ఈ సంఘటన వల్సద్ జిల్లాలోని పర్డీ పట్టణంలో జరిగింది.

పాఠకుల కోసం ఫేస్‌బుక్ ద్వారా ఎప్పటికప్పుడు తాజా వార్తలు... లైక్ చేయండి.

4-year-old girl in hospital after falling from fourth floor

వివరాల్లోకి వెళితే... మహిదేశాయ్ అనే బాలిక తన తల్లి తండ్రులతో పర్డీ పట్టణంలోని ఓంకార్ అపార్ట్‌మెంట్స్‌లో నివసిస్తున్నారు. మహి దేశాయ్ తన తాత వెంటరాగా గాలిపటం ఎగరేసేందుకు నాల్గవ అంతస్తుకు చేరుకుంది. ప్రమాదవ శాత్తు నాల్గవ అంతస్తు నుంచి కింద పడింది. అంతెత్తు నుంచి కిందపడిన బాలిక బంతిలా ఎగిరింది. ఈ విషయాలు సీసీ కెమెరా పుటేజ్‌లో నమోదయ్యాయి.

ఐతే అధ్బుతం ఏంటంటే అంత ఎత్తు నుంచి పడిన బాలిక మహి దేశాయ్ తన ప్రాణాలను దక్కించుకుంది. దీంతో హుటాహుటిన బాలికను సమీపంలోని ఆసుపత్రిలో చేర్చించి చికిత్స అందిస్తున్నారు. బాలికకు చికిత్స చేస్తున్న వైద్యుడు ఖురేషిని కూడా ఈ సంఘటన ఆశ్చర్యానికి గురిచేసింది.

ఇదొక అధ్బుతమంటూ వ్యాఖ్యానించారు. బాలికకు చిన్న చిన్న గాయాలు కావడంతో డాక్టర్. ఖురేషి చికిత్స చేశారు.నాల్గవ అంతస్తు నుంచి మహి దేశాయ్ కింద పడిన వీడియోని ఇక్కడ వీక్షించండి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+