• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

నాలుగేళ్ల మోడీ పాలన: గ్రామీణ భారతాన్ని వెలిగించిన విద్యుత్ శాఖ..

|

న్యూఢిల్లీ: నాలుగేళ్ల మోడీ పాలనలో విద్యుత్ శాఖ తనదైన ముద్రవేసింది. దేశంలోని మారుమూల ప్రాంతాలను సైతం విద్యుద్దీకరించింది. విద్యుత్ మిగులు దేశంగా భారదేశాన్ని నిలిపింది. కేంద్రమంత్రి పీయూష్ గోయల్ నేత్రుత్వంలోని విద్యుత్ శాఖ గ్రామీణ భారతాన్ని వెలిగించింది. మంత్రిత్వ శాఖల్లో అత్యుత్తమ పనితీరును కనబరిచిన శాఖగా విద్యుత్ శాఖ ముందు వరుసలో ఉందనడంలో అతిశయోక్తి లేదు.

నాలుగేళ్ల మోడీ సర్కార్: నక్సల్స్ అణచివేతకు హోంమంత్రిత్వ శాఖ చేపట్టిన కీలక చర్యలు..

సమర్థవంతంగా విద్యుత్ శాఖ కార్యకలాపాలను నిర్వహిస్తున్న పీయూష్ గోయల్.. మిగతా మంత్రిత్వ శాఖలతో సమన్వయంతో సాగుతున్నారు. ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చేనాటికి దేశవ్యాప్తంగా విద్యుత్ కు సంబంధించి అనేక సవాళ్లు నెలకొన్నాయి. పీయూష్ నేత్రుత్వంలో భారత్ విద్యుత్ మిగులు దేశంగా నిలిచిందంటే.. అది ఆయన పనితీరు కారణంగానే అని చెప్పాలి. థర్మల్ ఆధారిత విద్యుత్ సామర్థ్యం విషయంలో భారత్ వేగవంతమైన ప్రగతిని సాధించింది. ఈ నాలుగేళ్లలో విద్యుత్ శాఖ సాధించిన పలు విజయాలను ఒకసారి పరిశీలిద్దాం..

4 years of Modi govt: Power ministrys unwavering endeavour illuminated rural India

ఉజాలా పథకం లేదా ఉన్నత్ జ్యోతి అఫోర్డబుల్ ఎల్‌ఈడీలు:

గృహ వినియోగదారులకు ఎల్ఈడీ బల్బులను అందించడం ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశం. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 77కోట్ల ఇన్ కేండిసెంట్ బల్బుల స్థానంలో ఎల్ఈడీ బల్బులను అమర్చాలన్న లక్ష్యం పెట్టుకున్నారు. మార్చి 2019ని ఇందుకు డెడ్ లైన్ గా నిర్దేశించుకున్నారు. ఎల్ఈడీ ట్యూబు లైట్లతో పాటు సీలింగ్ ఫ్యాన్లను కూడా ఈ పథకం ద్వారా ప్రవేశపెట్టారు. మే, 2018నాటికి 29.74కోట్ల ఎల్ఈడీ బల్బులు అమర్చడం జరిగింది. తద్వారా 38,626కిలో వాట్స్ విద్యుత్ ఆదా అయింది. ఈ బల్బుల ద్వారా రూ.15,450కోట్ల ఖర్చు ఆదా అయింది. అదే సమయంలో కార్బన్ డై యాక్సైడ్ ఉద్గారాలు 3,12,87,063 టన్నుల మేర తగ్గాయి.

దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామజ్యోతి యోజన:

  మోడీ పాల‌న‌కు నాలుగేళ్లు, 10 ముఖ్య వైఫ‌ల్యాలు ఇవే

  ఎన్నికల ప్రచారం సందర్భంగా విద్యుత్ కి సంబంధించి ప్రధాని మోడీ ఇచ్చి పలు వాగ్దానాలు కూడా ఆయన అధికారంలోకి రావడానికి కారణమయ్యాయి. 'అందరికీ విద్యుత్' అన్న ఆయన నినాదం బాగా పనిచేసింది. విద్యుత్ శాఖ నివేదిక ప్రకారం మొత్తం 5,97,464గ్రామాలకు గాను 597464 గ్రామాలు విద్యుద్దీకరించబడ్డాయి. తద్వారా ఈ పథకం కింద గ్రామీణ ప్రాంతాలకు నాణ్యమైన,నిరంతరాయ విద్యుత్ అందించాలన్న లక్ష్యం నెరవేరింది. విద్యుత్ తో ముడిపడి ఉన్న వ్యవసాయం, ఇతరత్రా రంగాల్లోనూ మౌలిక సదుపాయాల కల్పన ఆయా రంగాల బలోపేతంపై కూడా కేంద్రం దృష్టి పెట్టింది.

  ఉజ్వల్ డిస్కమ్ అస్యూరెన్స్ యోజన(ఉదయ్):

  రాష్ట్రాల పరిధిలోని పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు(డిస్కమ్స్)ను వ్యవస్థాగతంగా, ఆర్థికంగా బలోపేతం చేయడమే ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశం. ఏటీ(అగ్రిగేడ్ టెక్నికల్)&కమర్షియల్ నష్టాలను 15శాతం తగ్గించడంతో పాటు ఏసీఎస్(యావరేజ్ కాస్ట్ ఆఫ్ సప్లై)&ఏఆర్ఆర్(అగ్రిగేడ్ రెవెన్యూ రియలైజ్డ్) మధ్య వ్యత్యాసాన్ని 2018-19నాటికి జీరోకి తగ్గించడం దీని ప్రధాన లక్ష్యం. విద్యుత్ శాఖ నివేదిక ప్రకారం.. ఈ రంగంలో ఇలాంటి కృషి మునుపెన్నడూ లేని సమగ్ర సంస్కరణ.

  ఆపరేషనల్ ఇండికేటర్స్(ఏప్రిల్ 10,2018):

  ఫీడర్ మీటరింగ్: గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 100శాతం పూర్తి

  రూరల్ ఫీడర్ ఆడిట్: 100శాతం నిర్వహించారు

  ఫీడర్ సెగ్రగేషన్: 62శాతం మేర పూర్తి

  మంజూరైన బాండ్స్: రూ.2,32,163కోట్లు(16రాష్ట్రాల్లోని 86.29%డేటా ఆధారంగా)

  27 రాష్ట్రాలకు గాను 25రాష్ట్రాల్లో ధరల పున:సమీక్ష పూర్తి

  ప్రధానమంత్రి సహజ్ బిజ్లీ హర్ ఘర్ యోజన(ప్రతీ ఇంటికి విద్యుత్ పథకం):

  దేశంలోని నాలుగు కోట్ల నిరుపేదలకు, మధ్య తరగతి కుటుంబాలకు ఉచితంగా విద్యుత్ కనెక్షన్లు అందించడం ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశం. ఈ ప్రాజెక్టు వ్యయం రూ.16,320కోట్లు, గ్రాస్ బడ్జెటరీ సపోర్ట్(జీబీఎస్) రూ.12,320కోట్లు. గ్రామీణ ప్రాంతాల్లో గృహాల విద్యుత్ కనెక్షన్ల వ్యయం రూ.14025కోట్లు, జీబీఎస్ రూ.10,587.50కోట్లు. ఇక పట్టణ ప్రాంతాల గృహాల విద్యుత్ కనెక్షన్ల వ్యయం రూ.2295కోట్లు, జీబీఎస్ రూ.1,732.50కోట్లు.

  గృహ విద్యుత్ కనెక్షన్లకు సంబంధించి అక్టోబర్ 11,2017నుంచి మే 02, 2018వరకు 3,63,11,456 గ్రామాలకు గాను 50,69,235గ్రామాలు విద్యుద్దీకరించబడ్డాయి. ఇంకా 3,12,42,221 గ్రామాలు విద్యుద్దీకరించబడాల్సి ఉన్నది.

  జాతీయ వీధి లైట్ల ప్రోగ్రామ్(ఎస్.ఎల్.ఎన్.పి):

  3.5కోట్ల సాధారణ వీధి లైట్ల స్థానంలో ఎల్ఈడీ బల్బులను అమర్చడం ఈ పథకం ప్రధాన ఉద్దేశం. తద్వారా 9000 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదాతో పాటు సంవత్సరానికి 6.2మిలియన్ టన్నుల కార్బన్ ఉద్గారాలను నియంత్రించవచ్చు. మొత్తంగా మున్సిపాలిటీలకు ఏడాదికి రూ.5500కోట్ల ఖర్చు ఆదా అవుతుంది. ఇప్పటికైతే 57లక్షల ఎల్ఈడీ బల్బులను అమర్చారు. తద్వారా 1.28మెట్రిక్ టన్నుల కార్బన్ ఉద్గారాలను నియంత్రించినట్టయింది. విద్యుత్ శాఖ నివేదిక ప్రకారం ఎల్ఈడీ బల్బుల ద్వారా ఏడాదికి ఒక బల్బుకు సగటున 270.49 కిలో వాట్స్ విద్యుత్తును ఆదా చేయవచ్చు.

  గ్రామీణ విద్యుద్దీకరణలో జవాబుదారీతనం, పారదర్శకత పెంచేందుకు

  మొబైల్ అప్లికేషన్లు, వెబ్ సైట్స్ లాంచ్:

  ఈ పథకం కింద ప్రవేశపెట్టిన ఒక యాప్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో విద్యుద్దీకరణ పనులను పరిశీలించవచ్చు. ఇక 'సౌభాగ్య' వెబ్ పోర్టల్ ద్వారా గృహ విద్యుద్దీకరణకు సంబంధించిన పనపులను పరిశీలించవచ్చు. ఈ వెబ్ పోర్టల్ నవంబర్ 16, 2017లో ప్రారంభించారు.

  గార్వ్-II:

  డిసెంబర్ 20,2016న ఈ యాప్ లాంచ్ చేశారు. దీని ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 6లక్షల గ్రామాల్లో గృహ విద్యుద్దీకరణ పనుల గురించి తెలుసుకోవచ్చు. మొత్తం 15లక్షల గృహాలు, 17కోట్ల మంది ప్రజలు ఈ పథకం ద్వారా లబ్ది పొందుతున్నారు.

  ఉదయ్:

  ఉజ్వల్ డిస్కమ్ అస్యూరెన్స్ యోజన(ఉదయ్)కి సంబంధించిన ప్రస్తుత స్టేటస్ దీని ద్వారా తెలుసుకోవచ్చు.రాష్ట్ర స్థాయి ఆర్థిక, ఇతర కార్యకాలాపాలను, మంజూరు చేసిన బాండ్స్ వివరాలను తెలుసుకోవచ్చు. అలాగే ఏటీ&సీ నష్టాలు, టారిఫ్ రివిజన్, స్మార్ట్ మీటరింగ్, ఫీడర్ సెగ్రిగేషన్, వివరాలు కూడా తెలుసుకోవచ్చు.

  విద్యుత్ ప్రవాహ్:

  ప్రస్తుత విద్యుత్ ధరలు, అందుబాటులో ఉన్న విద్యుత్ గురించి ఈ యాప్ స్పష్టమైన వివరాలు అందిస్తుంది.

  ఉన్నత్ జ్యోతి ఆఫర్డబుల్ ఎల్ఈడీ ఫర్ ఆల్(ఉజాలా) మొబైల్ యాప్:

  గృహా విద్యుద్దీకరణకు సంబంధించి ఎల్ఈడీ బల్బుల పంపిణీ కార్యకలాపాలను దీని ద్వారా తెలుసుకోవచ్చు.

  ఉర్జా(అర్బన్ జ్యోతి అభియాన్) మొబైల్ యాప్:

  జూన్ 6, 2016న ఈ యాప్ లాంచ్ చేశారు. వినియోగదారుల ఫిర్యాదులు, అర్బన్ పంపిణీ సెక్టార్ ప్రాజెక్టులు సమర్పిస్తున్న నెలవారీ నివేదికలను ఇది అందుబాటులో ఉంచుతుంది. వీటితో పాటు సగటు వినియోగదారుడు ఎదుర్కొంటున్న సమస్యలు, వినియోగదారులు ఈ-పేమెంట్స్, విద్యుత్ చౌర్యం, విద్యుత్ నష్టం, ఏటీ&సీ నష్టం వంటి వివరాలు అందుబాటులో ఉంటాయి.

  ఈ-తరంగ్:

  విద్యుత్ సరఫరాకు సంబంధించిన వాస్తవాంశాలను దీని ద్వారా తెలుసుకోవచ్చు. ముఖ్యంగా అంతరాష్ట్ర విద్యుత్ సరఫరా ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలు, విద్యుత్ ధర, టీబీసీబీ విధానం వంటి విషయాలు తెలుసుకోవచ్చు.

  డీప్ (డిస్కవరీ ఆఫ్ ఎఫియెంట్ ఎలక్ట్రిసిటీ ప్రైస్) ఈ-బిడ్డింగ్:

  ఈ-రివర్స్ వేలంతో కూడిన కామన్ ఈ -బిడ్డింగ్ ప్లాట్ ఫామ్ ని ఈ పోర్టల్ అందిస్తుంది. దేశవ్యాప్తంగా విద్యుత్ కొనుగోలు అంశాలు, అందులో పారదర్శకత కోసం ఇది ఉపకరిస్తుంది.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  From electrification of villages to making India a power surplus country, the power ministry has been unwavering in its endeavour to light up the nation. As Modi government completes its four years, it would not be wrong to say that power ministry, which was under Piyush Goyal till recently, has been one of the top performing ministries.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more