ఆర్మీ కల్నల్ ఇంట్లో.. 117 కేజీల జింకమాసం, 40 తుపాకులు, రూ.కోటి నగదు

Posted By:
Subscribe to Oneindia Telugu

మీరట్: ఆర్మీలో కల్నల్ హోదాలో పని చేసిన ఉద్యోగి నివాసంలో భారీ ఎత్తున జింక మాంసం పట్టుబడడం యూపీలో పెను కలకలం రేపుతోంది. ఈ రిటైర్డ్ కల్నల్ కుమారుడు జాతీయ షూటర్ కావడం విశేషం.

జాతీయ షూటర్ ప్రశాంత్ బిష్ణోయ్ తండ్రి, రిటైర్డ్ కల్నల్ దేవేంద్ర కుమార్ తన పరపతి, పలుకుబడితో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారు. ఉత్తర ప్రదేశ్‌ లోని మీరట్‌ లోని ఆయన నివాసంలో రెవెన్యూ ఇంటలిజెన్స్‌, అటవీ శాఖ (డీఆర్‌ఐ) అధికారులు సోదాలు నిర్వహించారు.

 40 Guns, 117 Kg Nilgai Meat Seized From Ex-Colonel in Meerut

ఈ సోదాల్లో ఆయన నివాసంలో 117 కేజీల నీల్గాయ్‌ (జింక) మాంసం, 40 తుపాకులు, అత్యాధునిక కెమెరాలు, 5 జింక తలలు, జింక కొమ్ములు, చిరుత పులుల చర్మాలు, ఏనుగు దంతాలు లభ్యమయ్యాయి.

వీటన్నింటితో పాటు కోటి రూపాయల నగదును కూడా ఆయన నివాసం నుంచి రెవెన్యూ, అటవీశాఖాధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆయన కుమారుడు బిష్ణోయ్ ను విచారించామని తెలిపారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Meerut: Over a hundred illegally imported firearms, 117 kg of nilgai (blue bull) meat, horns and skins of leopards and blackbucks were allegedly seized on Sunday in raids, including at the residence of a retired colonel, with the Directorate of Revenue Intelligence (DRI) claiming to have busted a global poaching syndicate. Of the seizures made, 117 kg nilgai meat stored in a refrigerator, animal skins, ivory, five deer skulls, horns of sambar deer, antlers of antelope and blackbuck and 40 guns were seized from a makeshift warehouse at the house of a retired army colonel in Meerut, a DRI and a forest department official said.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి