పేరుకు మాత్రమే సీఎం వెంట ఎమ్మెల్యేలు: మావైపు 40 మంది వస్తారు: టీటీవీ దినకరన్ గ్యాంగ్ !
పేరుకు మాత్రమే సీఎం పళనిసామి వెంట ఎమ్మెల్యేలు మావైపు 40 మంది ఎమ్మెల్యేలు వస్తారు: తంగ తమిళ సెల్వన్ బలపరీక్ష జరిగితే అప్పుడు మా సత్తా చూపిస్తాం: వెట్రివేల్
చెన్నై: అన్నాడీఎంకే పార్టీకి చెందిన 40 మందికి పైగా ఎమ్మెల్యేలు మాకు మద్దతు ఇవ్వడానికి సిద్దంగా ఉన్నారని, తమిళనాడులోని ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వం ఎక్కువ రోజులు అధికారంలో ఉండదని టీటీవీ దినకరన్ వర్గంలోని ఎమ్మెల్యే తంగ తమిళ సెల్వన్ జోస్యం చెప్పారు.
మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ శశికళ, టీటీవీ దినకరన్ ను పార్టి నుంచి బహిష్కరించాలని పన్నీర్ సెల్వంతో కలిసి ప్రయత్నాలు చేస్తున్న ఎడప్పాడి పళనిసామి నమ్మకద్రోహి అంటూ విమర్శించారు. సీఎం చేసిన వారికే పళనిసామి వెన్నుపోటు పోడుస్తున్నారని ఎమ్మెల్యే తంగ తమిళ సెల్వన్ విమర్శించారు.

అధికారంలో ఎడప్పాడి పళనిసామి వెంట ఉన్న ఎమ్మెల్యేలు దాదాపు 40 మంది మా వైపు వచ్చే అవకాశం ఉందని టీటీవీ దినకరన్ వర్గంలోని సీనియర్ ఎమ్మెల్యే వెట్రివేల్ అన్నారు. పేరుకు మాత్రమే ఎమ్మెల్యేలు ఎడప్పాడి పళనిసామి వెంట ఉన్నారని, బలపరీక్ష జరిగితే ఆయనకు వ్యతిరేకంగా ఓటు వెయ్యడానికి ఆ ఎమ్మెల్యేలు సిద్దంగా ఉన్నారని వెట్రివేల్ చెప్పారు. మొత్తం మీద ఎడప్పాడి పళనిసామి వర్గంలోని ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తున్న టీటీవీ దినకరన్ పళనిసామి, పన్నీర్ సెల్వంను అయోమయానికి గురి చెయ్యడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications