దారుణం: కారులో తిప్పుతూ మహిళపై గ్యాంగ్‌రేప్

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అస్వస్థత కారణంగా స్థానిక ఆస్పత్రికి వెళ్లింది బాధిత మహిళ. ఆమె ఆస్పత్రికి వెళ్లి తిరిగి వస్తుండగా పంఛాలి కుర్ద్ గ్రామానికి చెందిన నిందితులు పింకు, కల్లు ఆమెను పార్తాపూర్ బైపాస్ ప్రాంతంలో కిడ్నాప్ చేశారు.
అనంతరం ఆమెను కారులో తిప్పుతూ సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత నంగ్ల జమల్పూర్ అటవీ ప్రాంతంలో ఆమెను పడేసి పరారయ్యారు.
బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితులు పింకు, కల్లులపై కేసు నమోదు చేసిన పోలీసులు, వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.












Click it and Unblock the Notifications