420, ఫోర్జరీ ఎవరో ప్రపంచానికే తెలుసు, మోడీ ఇంటి ముందే శశికళ ఫ్యామిలీకి సీఎం వార్నింగ్ !

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి చిన్నమ్మ శశికళ కుటుంబ సభ్యులకు ఝలక్ ఇచ్చారు. తమిళనాడులో కాకుండా దేశ రాజధాని న్యూఢిల్లీలో శశికళ సోదరి వనితామణి కుమారుడు టీటీవీ దినకరన్ కు గట్టిగానే హెచ్చరించారు.

ఢిల్లీలో మకాం వేసిన పళనిసామి, పన్నీర్ సెల్వం, రాజీ కోసం బీజేపీ పెద్దలు, కలిసి చెన్నైకి !

మోసగాడు, 420 అనే పదలు టీటీవీ దినకరన్ కు కచ్చితంగా సరిపోతాయని వ్యంగంగా అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయిన ఎడప్పాడి పళనిసామి తరువాత మీడియాతో మాట్లాడారు. జైళ్లు, కోర్టుల చుట్టు ఎవరు తిరుగుతున్నారో ప్రపంచం మొత్తం తెలుసని చెప్పారు.

420 and forgery will suit for TTV Dinakaran only says CM Palanisamy

సీఎంను విమర్శించే ముందు టీటీవీ దినకరన్ తనకు ఏం అర్హత ఉందో తెలుసుకోవాలని ఎడప్పాడి పళనిసామి చూసించారు. టీటీవీ దినకరన్ బెదిరింపులకు ఇక్కడ భయపడేవారు ఎవ్వరూ లేరని ఎడప్పాడి పళనిసామి గట్టిగానే సమాధానం ఇచ్చారు.

నాతో పెట్టుకోవద్దు, సీఎం పళనిసామికి వార్నింగ్ ఇచ్చిన శశికళ అక్క కొడుకు, పదవిలో ఉండవు !

తమిళనాడులోని తంజావూరులో టీటీవీ దినకరన్ మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి మోసం చేశాడని, అతను ఓ 420 అని విమర్శించారు. మీడియా ద్వారా ఈ విషయం తెలుసుకున్న తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి హస్తినలో టీటీవీ దినకరన్ కు గట్టిగానే సమాధానం ఇచ్చి పరోక్షంగా హెచ్చరించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Chief minister Edappadi palanisami said that 420 and forgery will suit for TTV Dinakaran only. He said this after meeting with PM Modi.
Please Wait while comments are loading...